Nara Lokesh: భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చేనేత ప్రతీక: లోకేష్
ABN , Publish Date - Aug 07 , 2025 | 09:22 AM
చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని లోకేష్ అభివర్ణించారు.
అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని అభివర్ణించారు. మన నేత సోదరులు నేసిన వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరుగడించాయని ఉద్ఘాటించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (x) వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడు కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తోందని ప్రకటించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని తమ ప్రభుత్వమే భరించనుందని చెప్పుకొచ్చారు. దీంతో పాటు త్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి రూ.5 కోట్లు విడుదల చేయనుందని వెల్లడించారు. నేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటి నిలుస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Fire Accident: ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు
CM Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం
For More AP News and Telugu News