CM Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం
ABN , Publish Date - Aug 07 , 2025 | 08:11 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. మంగళగిరిలో పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు
అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ (గురువారం) మంగళగిరిలో (Mangalagiri) పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. మంగళగిరిలో పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. చేనేత దినోత్సవ సందర్భంగా మూడు పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
మూడు కీలక హామీలైన ఉచిత విద్యుత్, ప్రభుత్వమే జీఎస్టీ అమలు, త్రిఫ్ట్ ఫండ్ పథకాలను సీఎం ప్రారంభించనున్నారు. మంగళగిరి హ్యాండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించనున్నారు. చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన మగ్గాలు, చేనేత వస్త్రాలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అలాగే ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం క్రియేటివ్ పాలసీపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం విజయవాడ నోవోటెల్ పీ4 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.