Fire Accident: ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు
ABN , Publish Date - Aug 07 , 2025 | 07:49 AM
శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ ట్రక్ గురువారం తెల్లవారుజామున తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డు రావడంతో అదుపుతప్పింది. ఈ ఘటనలో ట్రక్ బోల్తా పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
తిరుపతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ ట్రక్ ఇవాళ(గురువారం) తెల్లవారుజామున తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డు రావడంతో అదుపు తప్పింది. ఈ ఘటనలో ట్రక్ బోల్తా పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే గాజులమండ్యం, రేణిగుంట పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.
అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరగడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాం నెలకొంది. ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అతి కష్టం మీద లారీ ముందు అద్దాలను పగలగొట్టి డ్రైవర్ బయటకు దూకాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
కర్నూలు జిల్లాలో ప్రమాదం..
మరో ఘటనలో.. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి దగ్గర జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీని మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను వెంటనే కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: సింగపూర్ మంత్రులను బెదిరించారు
AG Dammalapati Srinivas: పారిశ్రామిక పాలసీ ప్రకారమే లులూకు భూమి
For More AP News and Telugu News