Share News

Nara Lokesh Meets Annamalai: బీజేపీ నేత అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ.. ఎందుకంటే

ABN , Publish Date - Sep 08 , 2025 | 02:19 PM

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

Nara Lokesh Meets Annamalai: బీజేపీ నేత అన్నామలైతో మంత్రి లోకేష్ భేటీ.. ఎందుకంటే
Nara Lokesh Meets Annamalai

అమరావతి/కోయంబత్తూర్, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో (Annamalai) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు మంత్రి నారా లోకేష్.


డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నందున ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని తెలిపారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాలని అన్నామలైని ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్‌.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..

కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.. అసలు విషయమిదే..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 08 , 2025 | 06:15 PM