Minister Nara Lokesh: విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి: నారా లోకేశ్
ABN , Publish Date - Dec 15 , 2025 | 02:09 PM
కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీలో సోమవారం సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ఢిల్లీలో ఇవాళ(సోమవారం) పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈమేరకు మంత్రి లోకేశ్ పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేశ్.
విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడలోని ఐదు ఎకరాల స్థలాన్ని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI) స్థాపన కోసం ఏపీ ప్రభుత్వం ముందస్తుగా గుర్తించిన విషయాన్ని జయంత్ చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా అధ్యాపక అభివృద్ధి, పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. అదేవిధంగా ఏపీలో ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితిని మంచి SBTET-AP ద్వారా NCVET అర్హతలను పెద్దఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ వెంట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు పాల్గొన్నారు.
ఎంపీలతో మంత్రి నారా లోకేశ్ భేటీ..
మరోవైపు.. పార్లమెంట్‌కు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. పార్లమెంట్‌లో మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికారు ఎంపీలు, మంత్రులు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయ్యారు. మరికాసేపట్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో సమావేశం కానున్నారు మంత్రి లోకేశ్. విద్య, ఐటీ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు మంత్రి లోకేశ్.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత
ముగిసిన భవానీ దీక్షలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..
Read Latest AP News And Telugu News