Share News

CM Chandrababu: జగన్.. మూడు ముక్కలాటతో ఏపీకి రాజధాని లేకుండా చేశారు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 23 , 2025 | 07:27 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్థం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

CM Chandrababu: జగన్.. మూడు ముక్కలాటతో ఏపీకి రాజధాని లేకుండా చేశారు: సీఎం చంద్రబాబు
AP CM Nara Chandrababu Naidu

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మూడు ముక్కలాటతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్‌- 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్గాటించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామని చెప్పారు. అన్నీ చేసేశామని చెప్పట్లేదని.. ఊహించిన దాని కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అమలు చేశామని అన్నారు. సీఎం పదవి తనకు కొత్తకాదని నాలుగు సార్లు సీఎం అయ్యానని గుర్తుచేశారు. మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకుంటామని ఉద్ఘాటించారు. సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా కలిసి రావాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు.


ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై "సుపరిపాలనలో తొలి అడుగు" పేరిట ఏడాది పాలనపై ఇవాళ(సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్ ప్రారంభించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్‌వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆ తర్వాత రెండో ఏడాది లక్ష్యాలపై సమావేశంలో మాట్లాడారు. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా ఈ సమావేశం నిర్వహించారు.


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తయితే ఏపీకి నీటి సమస్య సమసిపోతుందని వెల్లడించారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే నాలుగు సంతకాలు పెట్టానని గుర్తుచేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చామని ప్రకటించారు. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్థం చేశారని ఆరోపించారు. 213 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతున్నామని ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్లు సాయం చేశామని చెప్పారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించాం.. పూర్తి చేస్తామని మాటిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.12,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. విశాఖపట్నం రైల్వేజోన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. తల్లికి వందనం హామీని పూర్తిగా నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

దూకుడు పెంచిన సిట్.. మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం

యూఎస్‌ను హెచ్చరించిన ఇరాన్

For More Andhrapradesh News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 09:17 PM