Share News

Phone Tapping Case: దూకుడు పెంచిన సిట్.. మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం

ABN , Publish Date - Jun 23 , 2025 | 02:02 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. ఆ క్రమంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సిట్ అధికారులు విచారించారు.

Phone Tapping Case: దూకుడు పెంచిన సిట్.. మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం
TG Ex CS Santhakumari

హైదరాబాద్, జూన్ 23: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) దూకుడు పెంచింది. అందులోభాగంగా సోమవారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్( ఎస్ఐబీ) రివ్యూ కమిటీ ప్యానల్‌‌ను తప్పుదోవ పట్టించిందని తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి వాంగ్మూలం ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబీ పంపిన నెంబర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మాజీ సీఎస్ ఈ సందర్భంగా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు స్టేట్‌మెంట్‌ను సైతం సిట్ అధికారులు రికార్డు చేశారు. మావోయిస్టు సానుభూతిపరులు ఉగ్రవాద సంబంధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఐబీ నుంచి రివ్యూ కమిటీకి లేఖ ఇచ్చినట్లు గుర్తించారు.


మరోవైపు ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతల వాంగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక సాధారణ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బరిలో దిగిన సమయంలో.. ఆయనతోపాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించారు. అలాగే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత బిళ్ల సుధీర్ రెడ్డి వాంగ్మూలాన్ని సైతం నమోదు చేశారు. ఆ క్రమంలో వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

యూఎస్‌ను హెచ్చరించిన ఇరాన్

ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ

For More Telangana News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 02:08 PM