Fiber Net case: ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:11 PM
ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో మదుసూధన్ రెడ్డి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ కేసును మూసి వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విజయవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఫైబర్ నెట్ కేసులో (Fiber Net case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై (Chandrababu Naidu) వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మదుసూధన్ రెడ్డి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ కేసును మూసి వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ చైర్మన్‌గా పని చేసిన వైసీపీ నేత గౌతం రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తాను అక్రమాలను గుర్తించి విచారణ చేయాలని ఎండీ మధుసూదన్‌కి లేఖ రాసినట్లుగా పిటిషన్‌లో పేర్కొన్నారు గౌతం రెడ్డి. తాను రాసిన లేఖపై కేసు నమోదైందని.. ఈ కేసు క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రొటెక్షన్ క్లోజర్ పిటిషన్ వేశారు గౌతం రెడ్డి. కేసు మూసిచేసే ముందు తన వాదనలు వినాలని పిటీషన్‌లో పేర్కొన్నారు గౌతం రెడ్డి. రేపు(శుక్రవారం) ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News