Minister Satyakumar: యోగి ట్రీట్మెంట్ కావాలి.. సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 21 , 2025 | 09:27 PM
వైసీపీ మాజీ మంత్రులు తనపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. కొందరూ వ్యవస్థలో లొసుగులను ఉపయోగించి పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కాకినాడ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఏపీలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలని చెప్పుకొచ్చారు. వైసీపీ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ.. దానిని పూర్తిగా తొలగించాలని విమర్శించారు. రాజమండ్రి గోరక్షణపేట సెంటర్‌లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ఆవిష్కరణ, భారీ బహిరంగ సభ ఇవాళ(ఆదివారం) జరిగింది.
ఈ సభలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాజమండ్రి ఎంపీ పురందరేశ్వరి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కొందరు వ్యవస్థలో లొసుగులను ఉపయోగించి పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ మాజీ మంత్రులు తనపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజమెత్తారు.
తాను పుట్టినా, చనిపోయినా బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల విషయంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు చేస్తామని... ఆ పార్టీ నేతలు అంటున్నారని ఎప్పుడో కాదు, ఇప్పుడు కోర్టుకి వెళ్లి అరెస్టు చేయించవచ్చు కదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో పిల్లలకు హెల్త్ డిజిటల్ రికార్డు మెయింటైన్ చేస్తున్నామని వివరించారు. సర్వే చేసి అవసరమైన వాళ్లకు ట్రీట్మెంట్ అందిస్తామని తెలిపారు. కోర్టులకు వెళ్లి మొట్టికాయలు తిన్నా వైసీపీ నాయకుల్లో మార్పు రాదని విమర్శించారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆక్షేపించారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
2014లో చంద్రబాబు, మోదీ సారథ్యంలో ఏపీ అభివృద్ది చెందిందని.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ఏపీలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు బైక్ ర్యాలీలు, సంతకాల పేరుతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కోటి సంతకాల పేరిట జగన్ అండ్ కో డ్రామా చేస్తున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు ఆశించిన విధంగా నవ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
వాజ్‌పేయి నిబద్ధత భవిష్యత్తు తరాలకు ఆదర్శం: మంత్రి కందుల దుర్గేశ్

మాజీ ప్రధాని వాజ్‌పేయికు రాజకీయాల పట్ల ఉన్న నిబద్ధత భవిష్యత్తు తరాలకు ఆదర్శమని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. వాజ్‌పేయి స్వశక్తితో ప్రధాని అయ్యారని తెలిపారు. దేశప్రజలంతా ఇష్టపడే వ్యక్తి వాజ్‌పేయి అని చెప్పుకొచ్చారు. రాజకీయాలు అంటే సేవ చేయటమేనని నిరూపించారని కొనియాడారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల నాయకత్వంలో ఏపీ అభివృద్ది చెందుతుందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ బర్త్‌డే వేడుక.. వైసీపీలో బయటపడ్డ కుమ్ములాటలు..!
అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి
Read Latest AP News And Telugu News