Share News

Tirupati Devasthanam Closure: తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేత.. అసలు విషయం ఇదే..

ABN , Publish Date - Aug 26 , 2025 | 06:53 PM

తిరుమల ఆలయాన్ని 7(శనివారం)వ తేదీ మధ్యాహ్నం 3.30గంటల నుంచి ఆదివారం వేకువజామున 3 గంటల వరకు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు 7వ తేదీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొంది.

Tirupati Devasthanam Closure: తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేత.. అసలు విషయం ఇదే..
Tirumala Temple

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన 12 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 7వ తేదీ రాత్రి 9:50 గంటల నుంచి 8వ తేదీ వేకువజామున ఒకటిన్నర వరకు గ్రహణం ఘడియలు ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.


ఈ నేపథ్యంలో 7వ తేదీ మధ్యాహ్నం 3:30గంటల నుంచి ఆదివారం వేకువజామున 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు 7వ తేదీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే.. గ్రహణం కారణంగా 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 8(ఆదివారం)వ తేదీ ఉదయం 8:30 వరకు అన్నదాన సముదాయాని కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. గ్రహణం అనంతరం శ్రీవారి సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ పింఛన్ల కొనసాగింపుపై కీలక ఆదేశాలు..

ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

For Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2025 | 08:04 PM