ABN AndhraJyoty Effect: ఆ పింఛన్ల కొనసాగింపుపై కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:10 PM
తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నవారందరికీ పెన్షన్లు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. దీంతో అంతకముందు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు, పెన్షన్ కొనసాగిస్తున్నామంటూ దివ్యాంగులకు ఏపీ సెర్ప్ నుంచి మెజేస్‌లు వచ్చాయి.
అమరావతి: అర్హులైన వారందరి పింఛన్లు కొనసాగించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో 18 వేల మందికి పెన్షన్ నిలిపేయడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అర్హత ఉన్న పెన్షన్లను తొలగించేందుకు నోటీసులు ఇచ్చారని ఏబీఎన్ లో కథనాలు వెలువడ్డాయి. తమ పెన్షన్ నిలిపేశారంటూ పెద్దఎత్తున ఏబీఎన్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. వచ్చిన నోటీసులను కూడా ఏబీఎన్‌కు పంపించారు. దీనిపై ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారమయ్యాయి. 18 సంవత్సరాలలోపు పిల్లలకు వైకల్యం ఉంటే వారికి అధికారులు తాత్కాలిక దివ్యాంగుల సర్టిఫికేట్ ఇచ్చారు. 18 సంవత్సరాలలోపు శరీరంలో మార్పులు వస్తాయని.. అందువల్ల వారికి తాత్కాలిక సర్టిఫికెట్ ఇవ్వాలన్న కేంద్ర మార్గదర్శక సూత్రాల ప్రకారం తాత్కాలిక సర్టిపికేట్ ఇచ్చిన 18 వేల మందికి అధికారులు పెన్షన్లు నిలిపివేశారు.
ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేయడంతో దివ్యాంగులు గగ్గోలు పెట్టారు. ఏబీఎన్ కథనాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నారు. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నవారందరికీ పెన్షన్లు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అంతకముందు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు, పెన్షన్ కొనసాగిస్తున్నామంటూ దివ్యాంగులకు ఏపీ సెర్ప్ నుంచి మెజేస్‌లు వచ్చాయి. పెన్షన్ తొలగింపునకు నోటీసులు ఇచ్చిన 80 వేలమందిలోనూ అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్ధాయిలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా పరిశీలిస్తున్నామని, నిజంగా అర్హులైతే వారి పెన్షన్‌ను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్
ప్రాణం తీసిన ప్రేమ.. ఏం జరిగిందంటే..
ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు