Share News

AP Government Alert on Heavy Rains: భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:58 PM

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

AP Government Alert on Heavy Rains: భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్
AP Government Alert on Heavy Rains

విశాఖపట్నం, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తోండటంతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.


అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.


శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలపై అలర్ట్..

atchennaidu1.jpg

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలపై అధికారులను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు.


ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి మార్గనిర్దేశం చేశారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు వర్షాభావ పరిస్థితిని అంచనా వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ

ఎకో ఫ్రెండ్లీ గణేష్ తయారీలో.. ఎన్టీఆర్ జిల్లా వరల్డ్ రికార్డ్‌

For More AP News And Telugu News

Updated Date - Aug 26 , 2025 | 02:07 PM