Share News

MLC Ramgopal Reddy Letter to CM Chandrababu: టీడీఆర్ బాండ్ల అవకతవకలపై హై లెవెల్ దర్యాప్తు చేపట్టండి

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:41 PM

తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను రాంగోపాల్ రెడ్డి ప్రస్తావించారు.

MLC Ramgopal Reddy Letter to CM Chandrababu: టీడీఆర్ బాండ్ల అవకతవకలపై హై లెవెల్ దర్యాప్తు చేపట్టండి
MLC Rangopal Reddy Letter to CM Chandrababu

తిరుపతి, ఆగస్టు29 (ఆంధ్రజ్యోతి): తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై (TDR Bonds Scam) దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి (TDP MLC Ramgopal Reddy) ఇవాళ(శుక్రవారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను రాంగోపాల్ రెడ్డి ప్రస్తావించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో వందల కోట్ల టీడీఆర్ కుంభకోణం జరిగిందని తెలిపారు. బాండ్ల స్కాంలో మోసం, అవినీతి గురించి అనేక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని గుర్తుచేశారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి.


తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీడీఆర్ బాండ్లలో అవినీతి జరిగిందని ఇటీవల ఆరోపించారని గుర్తుచేశారు. ఒక రాష్ట్ర స్థాయి అధికారిణికి ఈ డబ్బు అంతా చేరిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారని వివరించారు. టీడీఆర్ బాండ్లలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని చెబుతూ... అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్పకుండా భూమన దాచి పెట్టారని తెలిపారు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేనే కీలక పదవిలో ఉన్న అధికారిణిపై ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాంగోపాల్ రెడ్డి. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక అధికారిణి ఎవరు..? ఆమె పాత్ర ఏమిటనే అంశంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ క్రీడాకారులకు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఆ అధికారిని విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై చింతా మోహన్ ఫైర్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 29 , 2025 | 01:14 PM