Share News

YSRCP: బంగారుపాళ్యంలో జగన్ పర్యటన.. వైసీపీ మూకల వీరంగం

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:09 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

YSRCP: బంగారుపాళ్యంలో జగన్ పర్యటన..  వైసీపీ మూకల వీరంగం
Jagan Bangarupalem Visit

చిత్తూరు: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇవాళ(బుధవారం) చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో (Bangarupalem) పర్యటిస్తున్నారు. స్థానిక మార్కెట్ యార్డ్‌లో రైతులను పరామర్శించి వారి సమస్యల గురించి జగన్ తెలుసుకుంటున్నారు. వైసీపీ అధినేత పర్యటన సందర్భంగా పలు ఆంక్షలు విధించారు చిత్తూరు జిల్లా పోలీసులు.


షరతులతో కూడిన అనుమతులని ఇచ్చారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. మార్కెట్ యార్డులో 500మంది, హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యంలో ఎలాంటి అల్లర్లకు చోటులేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తుగా వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


వైసీపీ మూకల వీరంగం..

అయితే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా చేశారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్‌ యార్డ్‌లోకి వైసీపీ శ్రేణులు ప్రవేశించారు. పోలీసుల సూచనలను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


హెలిప్యాడ్‌ వద్ద తొక్కిసలాట..

బంగారుపాళ్యంలోని హెలిప్యాడ్‌కి జగన్ రెడ్డి చేరుకున్నారు. హెలి‌ప్యాడ్ వద్ద జగన్‌ని కలిసేందుకు వైసీపీ శ్రేణులు భారీగా ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు నానావస్థలు పడ్డారు. వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో తోపులాట జరిగింది. హెలి‌ప్యాడ్ వద్ద తొక్కిసలాటతో పరిస్థితి గందరగోళంగా మారింది. వారి వైఖరితో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా వైసీపీ కీలక నేతల అండ చూసుకొని బంగారుపాళ్యంలో ఆ పార్టీ మూకలు భయాందోళనలు సృష్టించారు.


బంగారుపాళ్యంలో హై టెన్షన్...

బంగారుపాళ్యం జగన్ పర్యటనలో అపశృతులు చోటుచేసుకున్నాయి. జగన్ ప్రతి పర్యటనలో ఏదో ఒక రకమైన గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగారుపాళ్యం పర్యటనలో హెలిప్యాడ్ వద్ద తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ కింద పడిపోయింది. పోలీసులు వచ్చి ఆమెను బయటకు తీసి రక్షించారు. అలాగే చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి తొక్కిసలాటలో కిందపడ్డారు. ఆమెకి ప్రమాదం తృటిలో తప్పింది.

పోలీసులపై వైసీపీ శ్రేణులు దురుసుగా ప్రవర్తించారు. ఓ కానిస్టేబుల్ చొక్కాని చించివేశారు. వైసీపీ శ్రేణుల దురుసు ప్రవర్తనలో స్పృహ తప్పి కానిస్టేబుల్ పడిపోయాడు. మార్కెట్ యార్డులోకి వైసీపీ జెండాలతో గేట్లు తోసుకొని గోడలు దూకి ఆ పార్టీ శ్రేణులు లోపలికి వెళ్లారు. వేల సంఖ్యలో వైసీపీ శ్రేణులు మార్కెట్లోకి వెళ్లడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి:

జగన్‌ జీవితమంతా ఇక ఓదార్పు యాత్రలే

స్లీపర్‌ సెల్స్‌పై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత

For More AP News and Telugu News

Updated Date - Jul 09 , 2025 | 02:10 PM