Share News

AP High Court: స్లీపర్‌ సెల్స్‌పై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:25 AM

రాష్ట్రంలో స్లీపర్‌ సెల్స్‌కు సంబంధించి పిటిషనర్లు సమర్పించిన వివరాల ఆధారంగా విచారణ జరిపి నివేదికను కోర్టు ముందుంచాలని డీజీపీని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది.

AP High Court: స్లీపర్‌ సెల్స్‌పై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత

  • ఆ తరహా ఉత్తర్వులు ఇచ్చి ఉండాల్సిందికాదన్న సీజే ధర్మాసనం

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్లీపర్‌ సెల్స్‌కు సంబంధించి పిటిషనర్లు సమర్పించిన వివరాల ఆధారంగా విచారణ జరిపి నివేదికను కోర్టు ముందుంచాలని డీజీపీని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే విధించింది. ఈ తరహా ఉత్తర్వులు ఇచ్చి ఉండాల్సిందికాదని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Jul 09 , 2025 | 06:27 AM