CM Chandrababu on Tirupati Visit Cancel: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు.. ఎందుకంటే..
ABN , Publish Date - Sep 14 , 2025 | 10:19 AM
రాష్ట్ర,కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు రెండు రోజుల పాటు జరుగనుంది. మొదటి రోజు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే వర్షం పడుతోండటంతో పర్యటనను రద్దు చేసుకున్నారు.
తిరుపతి, సెప్టెంబరు14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర,కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు (Women Empowerment Committee National Conference) ఇవాళ(ఆదివారం), రేపు(సోమవారం) రెండు రోజుల పాటు జరుగనుంది. మొదటి రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) పాల్గొనాల్సి ఉంది. అయితే, తిరుపతిలో భారీ వర్షం (Heavy Rains) పడుతోంది. భారీ వర్షం కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటనను (Tirupati Tour Changes) రద్దు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
మహిళా సదస్సు మొదటి రోజు కార్యక్రమాలిలా..
కాగా, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు (Women Empowerment Committee National Conference) మొదటి రోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
11:10కి మహిళా శిశు సంక్షేమ కమిటీ అధ్యక్షురాలు గౌరు చరితా రెడ్డి ప్రారంభ ఉపన్యాసం.
11:15 సావనీర్‌ను విడుదల చేయనున్న పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా.
11:20 : పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు డి. పురందేశ్వరి ఉపన్యాసం.
11:25 : తిరుపతి జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉపన్యాసం.
11:30 : మంత్రి పయ్యావుల కేశవ్ ఉపన్యాసం.
11:35 : అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉపన్యాసం.
11:40 : రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ ఉపన్యాసం.
11:55 పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లా ఉపన్యాసం.
అనంతరం ఇన్ కెమెరాలో సదస్సు.
రాత్రి 7:30: చంద్రగిరి కోటలో లైట్ అండ్ మ్యూజిక్ షోను తిలకించనున్న డెలిగేట్స్
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
నవయువతకు ప్రేరణ.. అబ్బురపరుస్తున్న దుర్గేశ్ విన్యాసాలు
Read Latest Andhra Pradesh News and National News