Share News

Jagadish Reddy: కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామన్న మాజీ మంత్రి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:57 PM

Telangana: ‘‘నేను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ఫైటర్‌ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకి పోయే దమ్మున్న నాయకుడిని. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది’’ అంటూ కోమటిరెడ్డి సోదరులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Jagadish Reddy: కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామన్న మాజీ మంత్రి

నల్గొండ, ఏప్రిల్ 18: ‘‘నేను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ఫైటర్‌ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకి పోయే దమ్మున్న నాయకుడిని. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది’’ అంటూ కోమటిరెడ్డి సోదరులపై (Komatireddy Brothers) మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Former Minister Jagadish Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Attack On Jagan: జగన్‌పై రాయి దాడి కేసులో కీలక అప్డేట్


గురువారం నల్గొండలో (Nalgonda) నిన్న (బుధవారం) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనార్ధన్ రావు మృతదేహానికి జగదీష్‌ రెడ్డి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్‌ఆర్ వద్ద కోమటిరెడ్డి సోదరులు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. రేవంత్ బూట్లు తుడుస్తున్నారు కోమటిరెడ్డి అన్నదమ్ములు అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘నా చరిత్ర ఎంటో, మీ చరిత్ర ఏంటో చర్చ పెడదామా’’ అంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముమ్మాటికీ బీజేపీ (BJP మనిషే అని.. బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ (Congress) మంత్రులే లీక్‌లు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

Elections 2024: రామనవమి ఘర్షణలకు కారణం మమతే.. బీజేపీ స్ట్రాంగ్ ఆరోపణలు..

AP News: ఆ అధికారులకు ఇప్పుడు తత్వం బోధపడింది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 01:05 PM