Share News

Uttamkumar: ఇక షెడ్డుకు పోవాల్సిందే.. బీఆర్‌ఎస్‌ నేతల‌కు ఉత్తమ్ సెటైర్

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:01 PM

Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ బయలుదేరిన బీఆర్‌ఎస్ కాన్వాయ్‌లోని ఓ బస్సు టైర్ పగడంతో చిన్న అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలింది అని చూశా. కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయి. ఇక షెడ్డుకు పోవాల్సిందే’’ అంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు.

Uttamkumar: ఇక షెడ్డుకు పోవాల్సిందే.. బీఆర్‌ఎస్‌ నేతల‌కు ఉత్తమ్ సెటైర్

హైదరాబాద్, మార్చి 1: ‘‘చలో మేడిగడ్డ’’ బయలుదేరిన బీఆర్‌ఎస్ (BRS) కాన్వాయ్‌లోని ఓ బస్సు టైర్ పగడంతో చిన్న అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. ‘‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) వెళ్తున్న బస్సు టైర్ పగిలింది అని చూశా. కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయి. ఇక షెడ్డుకు పోవాల్సిందే’’ అంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు.

ఎన్‌డీఎస్‌ఏకు పూర్తిగా సహకరిస్తాం...

ఉత్తమ్ ఇంకా మాట్లాడుతూ.. 2023 అక్టోబర్‌ 21న మేడిగడ్డ కుంగిపోయిందని.. తాము అధికారంలోకి వచ్చేవరకు కేసీఆర్ (BRS Chief KCR) నోరు మెదపలేదన్నారు. నల్లగొండ సభలో ఏం మాట్లాడలని కేసీఆర్ వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణని నాశనం చేసి మళ్ళీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. మేడిగడ్డ దగ్గరకి బ్యారేజీ తరలించేందుకే తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ అని కేసీఆర్ చెప్పారని.. సీడబ్ల్యూసీ (CWC) చెప్పిందని కేసీఆర్ అబద్ధం చెప్పారని కేంద్రం చెప్తోందని అన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక త్వరలో వస్తుందని.. బాధ్యుల పేర్లతో సహా నివేదిక వస్తుందని తెలిపారు. నివేదిక అనుగుణంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

BRS: బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 01 , 2024 | 04:01 PM