Share News

BRS: బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:37 PM

Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ పర్యటనలో భాగంగా కాళేశ్వరం బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌లో ఓ బస్సు టైర్ పేలింది. దీంతో బస్సును పక్కకు నిలిపివేశారు. ఆపై బస్సులోని బీఆర్‌ఎస్ నేతలంతా కార్లలో బయలుదేరారు. బస్సులో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ సహా పలువురు నేతలు ఉన్నారు.

BRS: బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

జనగామ, మార్చి 1: ‘‘చలో మేడిగడ్డ’’ పర్యటనలో భాగంగా కాళేశ్వరం (Kaleshwaram Project) బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతల (BRS Leaders) కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌లో ఓ బస్సు టైర్ పేలింది. దీంతో బస్సును పక్కకు నిలిపివేశారు. ఆపై బస్సులోని బీఆర్‌ఎస్ నేతలంతా కార్లలో బయలుదేరారు. బస్సులో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ (Former Andol MLA Kanti Kiran) సహా పలువురు నేతలు ఉన్నారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో గులాబీ నేతలు ఊరిపీల్చుకున్నారు.

మరోవైపు బీఆర్‌ఎస్ నేతల బస్సు యాత్ర జనగామ చేరుకుంది. మేడిగడ్డ సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బృందానికి పెంబర్తి ఆర్చి వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి దయాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్వాగతం పలికారు.

Lasya Nanditha: లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 01 , 2024 | 01:04 PM