Share News

BRS: అమీర్‌పేట్ హెచ్ఎండీఏ ఆఫీస్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:58 AM

Telangana: ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) ‌పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఆందోళన బాట పట్టింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.

BRS: అమీర్‌పేట్ హెచ్ఎండీఏ ఆఫీస్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా

హైదరాబాద్, మార్చి 6: ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) (LRS) ‌పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ (BRS) ఆందోళన బాట పట్టింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ (HMDA) కార్యాలయం వద్ద గులాబీ పార్టీ ధర్నాకు దిగింది. ఉచితంగా ఎల్‌ఆర్ఎస్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Former Minister Talasani SrinivasYadav), ఎమ్మెల్యే వివేకనంద గౌడ్ (MLA Vivekananda Goud), సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ (Talasani Sai Kiran Yadav), నగర నేతలు పాల్గొన్నారు.

AP Highcourt: భూయాజమాన్య హక్కు చట్టంపై హైకోర్టులో విచారణ వాయిదా


ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసే వరకు వదిలి పెట్టేదిలేదన్నారు. 25 లక్షల కుటుంబాలపై ఆర్ధిక భారం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పేదలపై రూ.20 వేల కోట్లు ఆర్ధిక భారం పడుతుందన్నారు. పేదలను దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేసే వరకు కాంగ్రెస్2ను వదిలి పెట్టే ప్రసక్తే లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

PM Modi: నీటి అడుగులో మెట్రో రైలు.. ప్రయాణించిన ప్రధాని మోదీ


జీహెచ్‌ఎంసీ ముందు...

మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ ముందు సిటీ ఎమ్మెల్యేల ఆందోళనకు దిగారు. ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో భారీగా పోలీసుల మోహరించారు.

ఇవి కూడా చదవండి..

CM Revanth Reddy: రేపే కాంగ్రెస్ తొలి జాబితా.. ఎంపిక బాధ్యత రేవంత్‌దే..

Car Accident Update: పెళ్లి కోసం స్వీడన్ నుంచి వచ్చాడు.. వారం క్రితమే పెళ్లి.. ఇంతలోనే..



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 06 , 2024 | 12:02 PM