Share News

CM Revanth Reddy: రేపే కాంగ్రెస్ తొలి జాబితా.. ఎంపిక బాధ్యత రేవంత్‌దే..

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:00 AM

రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కి అధిష్ఠానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హై కమాండ్‌కి వివరించనున్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటున్నారు.

CM Revanth Reddy: రేపే కాంగ్రెస్ తొలి జాబితా.. ఎంపిక బాధ్యత రేవంత్‌దే..

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాయి. రేపు టీ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. ఢిల్లీ (Delhi)లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (Congress Central Election Committee) సమావేశం జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరు కానున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్ కి అధిష్ఠానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హై కమాండ్‌కి వివరించనున్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని హస్తం నేతలు అంటున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను రేపు ఏఐసీసీ ప్రకటించనుంది.

TS News: గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్‌ స్టూడెంట్స్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 11:21 AM