Share News

Car Accident Update: పెళ్లి కోసం స్వీడన్ నుంచి వచ్చాడు.. వారం క్రితమే పెళ్లి.. ఇంతలోనే..

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:28 AM

ఇవాళ ఉదయం కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మరణించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వారం రోజుల క్రితమే అంటే ఫిబ్రవరి 29న బాల కిరణ్, కావ్యకు వివాహం జరిగింది. పెళ్లి చేసుకోవడానికి స్వీడన్ నుంచి బాల కిరణ్ ఇండియాకి వచ్చాడు.

Car Accident Update: పెళ్లి కోసం స్వీడన్ నుంచి వచ్చాడు.. వారం క్రితమే పెళ్లి.. ఇంతలోనే..

కర్నూలు: ఇవాళ ఉదయం కర్నూలు (Kurnool) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో పెళ్లికూతురు సహా పెళ్లి కొడుకు కుటుంబమంతా మరణించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వారం రోజుల క్రితమే అంటే ఫిబ్రవరి 29న బాల కిరణ్, కావ్యకు వివాహం జరిగింది. పెళ్లి చేసుకోవడానికి స్వీడన్ (Sweden)నుంచి బాల కిరణ్ ఇండియా (India)కి వచ్చాడు. పెళ్లి తర్వాత కావ్య నివాసమైన తెనాలి (Tenali)కి రవీందర్ కుటుంబ సభ్యులు వెళ్లారు. తెనాలి నుంచి నాలుగో తేదీన తిరుపతి (Tirupathi) దర్శనం కోసం రవీందర్ కుటుంబ సభ్యులు వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెళ్ళికొడుకు బాల కిరణ్.. పెళ్లికూతురు కావ్య, తండ్రి రవీందర్, తల్లి లక్ష్మి, డ్రైవర్ ఐదుగురూ మృతి చెందారు. దీంతో అల్వాల్‌లోని రవీందర్ ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.

TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. అసలు కారణమిదే!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 11:28 AM