Share News

Viral Video: నిప్పు లేకుండానే ఫిష్ ఫ్రై చేసిన యువతి.. విషయం తెలిస్తే..

ABN , Publish Date - May 26 , 2024 | 06:00 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగాల్‌లో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ యువతి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గోడపై వినూత్న ప్రయోగం చేసింది. తమ ప్రాంతంలో...

Viral Video: నిప్పు లేకుండానే ఫిష్ ఫ్రై చేసిన యువతి.. విషయం తెలిస్తే..

ఇటీవల అడపాదడపా వర్షాలు పడుతున్నా కూడా ఉక్కపోత, ఎండ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. మే నెల చివరికి వస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ 45 డిగ్రీలు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ ప్రభావం ఏ మేరకు ఉందో ఆయా ప్రాంతాల వారు వివిధ రూపాల్లో తెలియజేయడం చూస్తున్నాం. ఇటీవల ఓ ఆర్మీ సైనికుడు ఇసుకలో అప్పడం వేయించడం, గుడ్డు ఉడికించడం చూశాం. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల అవుతున్నాయి. తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిప్పు లేకుండానే ఫిష్ ఫ్రై చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగాల్‌లో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ యువతి (young woman) రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గోడపై వినూత్న ప్రయోగం చేసింది. తమ ప్రాంతంలో ఎండల ప్రభావం ఏ మేరకు ఉందో తెలియజేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఓ పెనం తీసుకుని గోడపై పెట్టి, అందులో నూనె పోసింది. చాలా సేపు అలాగే ఉంచడంతో ఎండ వేడికి నూనె వేడెక్కింది. ఆ తర్వాత అందులో సిద్ధంగా ఉంచుకున్న చేపను వేసింది. ఎండ దాటికి వేడెక్కిన నూనెలో (woman frying fish in the sun) చేపను వేయడగానే నిప్పుపై వేయించినట్లుగానే చేప మొత్తం ఫ్రై అయిపోయింది.

Viral Video: ఫొటో చూసి అబ్బాయిని రిజెక్ట్ చేసింది.. ఆ వెంటనే నవ్వుతూ ఓకే చెప్పింది.. కారణం తెలిస్తే..


చేపను ఓ వైపు వేయించిన తర్వాత.. రెండో వైపు తిప్పింది. ఇలా చేపను మొత్తం నిముషాల వ్యవధిలో ఫ్రై చేసేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఎండలు మండిపోతున్నట్లున్నాయ్’’.. అంటూ కొందరు, ‘‘ఎండలో ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ ఇంకొందరు, ‘‘ఎండలో నూనె వేడెక్కడం సాధ్యం కాదు.. ముందే వేడి చేసుకుని వచ్చినట్లు ఉన్నారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం 1.20లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: జలకాలాడుతున్న యువతిని చూసి జడుసుకుంటున్న జనం.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

Updated Date - May 26 , 2024 | 06:01 PM