Share News

Viral Video: లవర్ సమక్షంలోనే యువతికి తన బాడీ చూపించిన యువకుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - May 25 , 2024 | 09:51 PM

ఏదోటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు బహిరంగ ప్రదేశాల్లో విన్యాసాలు, డాన్సులు చేస్తుంటే.. మరికొందరు..

Viral Video: లవర్ సమక్షంలోనే యువతికి తన బాడీ చూపించిన యువకుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
ప్రతీకాత్మక చిత్రం

ఏదోటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు బహిరంగ ప్రదేశాల్లో విన్యాసాలు, డాన్సులు చేస్తుంటే.. మరికొందరు స్కిప్టెడ్ ప్రాంక్‌లు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు యువతికి తన లవర్ సమక్షంలో తన బాడీ ప్రదర్శన చేస్తాడు. చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఓ ప్రేమ జంట (lovers) నడుచుకుంటూ వస్తుంటుంది. అదే సమయంలో వారికి ఎదురుగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటాడు. తీరా దగ్గరికి వెళ్లాక.. ఆ యువకుడు టీషర్ట్ తీసేసి, (body showing) యువతికి తన కండలు చూపిస్తాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. యువకుడు చేసిన నిర్వాకానికి యువతి పక్కనే ఉన్న ప్రియుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. క్షణం ఆలస్యం చేయకుండా.. ‘‘నా ముందే నా ప్రియురాలికి బాడీ చూపిస్తావా’’.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువకుడి మెడపై చేయి వేసి ఒక్క తోపు తోసేస్తాడు.

Viral Video: ఈ వధువు చాలా స్మార్ట్ గురూ..! చుట్టూ అంతా ఉన్నా.. వరుడిని బురిడీ కొట్టించిందిగా..


యువతి ప్రియుడు తోసేయడంతో సదరు యువకుడు ఆ పక్కనే ఉన్న దుకాణ షట్టర్‌కు తగులుకుని పడిపోతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అయితే ఇదంతా వీళ్లు కావాలని ప్లాన్ చేసి తీసినట్లుగా ఉన్నా కూడా.. వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువకుడికి బాగా బుద్ధి చెప్పాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇది స్ర్కిప్టెడ్ వీడియో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: జలకాలాడుతున్న యువతిని చూసి జడుసుకుంటున్న జనం.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

Updated Date - May 26 , 2024 | 03:24 PM