Share News

Viral Video: జలకాలాడుతున్న యువతిని చూసి జడుసుకుంటున్న జనం.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

ABN , Publish Date - May 25 , 2024 | 07:31 PM

కొందరు తమ వృత్తిలో భాగంగా అనేక రకాల విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు కేవలం వ్యూస్, లైక్‌ల కోసం చిత్రవిచిత్ర విన్యాసాలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఇలాంటి పనులు చూసినప్పుడు కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్నిసార్లు...

Viral Video: జలకాలాడుతున్న యువతిని చూసి జడుసుకుంటున్న జనం.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

కొందరు తమ వృత్తిలో భాగంగా అనేక రకాల విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు కేవలం వ్యూస్, లైక్‌ల కోసం చిత్రవిచిత్ర విన్యాసాలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఇలాంటి పనులు చూసినప్పుడు కొన్నిసార్లు కోపం వస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు ఆశ్చర్యం కూడా కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జలకాలుడుతున్న యువతిని చూసి జనం జడుసుకుంటున్నారు. ఇంతకీ ఈమె చేసిన పనేంటో మీరే చూడండి...


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. జాంబియా-జింబాబ్వే సరిహద్దులో (Zambia-Zimbabwe border) చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం తెగ హల్‌హల్ చేస్తోంది. ఓ యువతి ఇక్కడి జలపాతంలో జలకాలాడుతోంది. ఇందులో జడుసుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. ఆమె ఉన్నది జలపాతం కింద కాదు.. ఏకంగా 380 అడుగుల ఏత్తైన జలపాతం (waterfall) మీద. అందులోనూ కొండ చివర అంచులో జలకాలాడుతోంది.

Viral Video: వామ్మో..! ఏంటయ్యా ఇదీ.. ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు.. చివరకు..


కొండ అంచు నుంచి నీళ్ల కిందకు దూకుతుండగా.. యువతి కొండ అంచున బోర్లా పడుకుని సంతోషంగా ఎంజాయ్ చేస్తోంది. కాస్త ముందుకు వెళ్లితే లోయలో పడిపోయే ప్రమాదం ఉన్నా.. ఆమె ఏమాత్ర భయం లేకుండా స్నానాలు చేస్తోంది. అంతటిలో ఆగకుండా కొండ అంచుకు వచ్చి కిందకు లోయలోకి తొంగిచూస్తూ నీళ్లలో చేతులు ఊపుతూ ఉంది.

Viral Video: వామ్మో..! వంట గదిలో ఈ రోబో చేసిన పని చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..


ఈ క్రమంలో ఏమాత్రం జారినా కిందపడే ప్రమాదం ఉంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది నిజమా లేక గ్రాఫిక్సా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ వధువు చాలా స్మార్ట్ గురూ..! చుట్టూ అంతా ఉన్నా.. వరుడిని బురిడీ కొట్టించిందిగా..

Updated Date - May 25 , 2024 | 07:31 PM