Share News

Viral Video: తెలివంటే ఈ కుక్కదే.. అంతెత్తు గోడను సైతం ఎంత ఈజీగా ఎక్కేసిందో చూడండి..

ABN , Publish Date - May 26 , 2024 | 04:38 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏదో వెతుక్కుంటూ వెళ్తున్న ఓ కుక్కకు (dog) మధ్యలో ఓ గోడ అడ్డుగా వస్తుంది. చాలా ఎత్తుగా ఉండడంతో కాసేపు ఆగి.. ‘‘ఎలా ఎక్కాలబ్బా’’.. అని అలోచిస్తుంది. చివరకు...

Viral Video: తెలివంటే ఈ కుక్కదే.. అంతెత్తు గోడను సైతం ఎంత ఈజీగా ఎక్కేసిందో చూడండి..

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. తెలివితేటలు ప్రదర్శించడంలోనూ అంతే ప్రత్యేకత సంతరించుకుంటుంటాయి. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. కుక్కలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎత్తైన గోడను ఎంతో అవలీలగా ఎక్కేసిన కుక్క తెలివి చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘తెలివంటే.. ఈ కుక్కదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏదో వెతుక్కుంటూ వెళ్తున్న ఓ కుక్కకు (dog) మధ్యలో ఓ గోడ అడ్డుగా వస్తుంది. చాలా ఎత్తుగా ఉండడంతో కాసేపు ఆగి.. ‘‘ఎలా ఎక్కాలబ్బా’’.. అని అలోచిస్తుంది. చివరకు ‘‘ఎలాగైనా సరే.. ఈ గోడను ఎక్కేయాలి’’.. అని నిర్ణయించుకుని ఆలోచిస్తుంది. ఈ క్రమంలో గోడ ఎదురుగా ఉన్న పెద్ద చెట్టును చూడగానే దానికి ఓ ఐడియా వచ్చేస్తుంది. వెంటనే చెట్టు వద్దకు వెళ్లి వెనుక కాళ్లు చెట్టు మొదలుపై, ముందు కాళ్లను గోడకు ఆనించి మెల్ల మెల్లగా పైకి జరుగుతుంది.

Viral Video: ఫొటో చూసి అబ్బాయిని రిజెక్ట్ చేసింది.. ఆ వెంటనే నవ్వుతూ ఓకే చెప్పింది.. కారణం తెలిస్తే..


ఇలా గోడ పైవరకూ ఇలాగే ఎంతో జాగ్రత్తగా జరుగుతూ చివరకు గోడపైకి జంప్ చేస్తుంది. ఈ విధంగా కుక్క అంతెత్తు ఉన్న గోడను సైతం ఎంతో అవలీలగా ఎక్కేసింది. పైకి ఎక్కిన కుక్క.. ‘‘చూశారా.. నా టాలెంట్’’.. అన్నట్లుగా కెమెరా వైపు చూస్తూ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఆర్మీలో శిక్షణ తీసుకున్నట్టుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: జలకాలాడుతున్న యువతిని చూసి జడుసుకుంటున్న జనం.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

Updated Date - May 26 , 2024 | 04:41 PM