Share News

Viral Video: ఫొటో చూసి అబ్బాయిని రిజెక్ట్ చేసింది.. ఆ వెంటనే నవ్వుతూ ఓకే చెప్పింది.. కారణం తెలిస్తే..

ABN , Publish Date - May 26 , 2024 | 03:51 PM

చాలా వివాహాలు పెళ్లి పీటల వరకూ వచ్చి వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అవుతుంటాయి. అలాగే మరికొన్ని వివాహాలు డబ్బుల విషయంలో తేడా వచ్చి ఆగిపోతుంటాయి. అబ్బాయి బాలేడని కొందరు, అమ్మాయి నచ్చలేదంటూ మరికొందరు పెళ్లిళ్లు రద్దు చేసుకోవడం చూస్తుంటాం..

Viral Video: ఫొటో చూసి అబ్బాయిని రిజెక్ట్ చేసింది.. ఆ వెంటనే నవ్వుతూ ఓకే చెప్పింది.. కారణం తెలిస్తే..

చాలా వివాహాలు పెళ్లి పీటల వరకూ వచ్చి వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అవుతుంటాయి. అలాగే మరికొన్ని వివాహాలు డబ్బుల విషయంలో తేడా వచ్చి ఆగిపోతుంటాయి. అబ్బాయి బాలేడని కొందరు, అమ్మాయి నచ్చలేదంటూ మరికొందరు పెళ్లిళ్లు రద్దు చేసుకోవడం చూస్తుంటాం. అదేవిధంగా నచ్చని వారిని కూడా ఏదో కారణంతోనే అంగీకరించే వారిని కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫొటో చూసి అబ్బాయి నల్లగా ఉండాలంటూ రిజెక్ట్ చేసింది. చివరకు అసలు విషయం తెలుసుకుని ఓకే చెప్పింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతికి (young woman) వారి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం తీసుకొస్తారు. యువకుడి ఫొటో చూసిన యువతి.. నల్లగా ఉన్నాడని తనకు నచ్చలేదని చెబుతుంది. ఈ మాటలు విన్న కుటుంబ సభ్యులు.. ‘‘అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు’’.. అని చెబుతారు.

Viral Video: లవర్ సమక్షంలోనే యువతికి తన బాడీ చూపించిన యువకుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


అలా చెప్పగానే అప్పటిదాకా డల్‌గా ఉన్న ఆమె.. ఒక్కసారిగా నవ్వుతూ మురిసిపోతుంది. ‘‘ఎంగేజ్‌మెంట్ డేట్ ఎప్పుడు’’.. అని కుటుంబ సభ్యులను నవ్వుతూ అడుగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గవర్నమెంట్ జాబ్ పవర్ అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘అతడెవరో కానీ అదృష్టవంతుడు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: జలకాలాడుతున్న యువతిని చూసి జడుసుకుంటున్న జనం.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

Updated Date - May 26 , 2024 | 04:03 PM