Share News

Viral Video: ఇది పిల్లి కాదు పులి.. పాముతో ఎలా ఫైట్ చేస్తోందో చూస్తే..

ABN , Publish Date - May 26 , 2024 | 07:33 PM

కుక్కలు, పిల్లలు కొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. పాములతో ఫైట్ చేసిన కుక్కలను చాలా చూశాం. ఇళ్లల్లోకి చొరబడుతున్న పాములతో ప్రాణాలకు తెగించి పోరాడి తమ యజమానులను కాపాడుతుంటాయి. అలాగే..

Viral Video: ఇది పిల్లి కాదు పులి.. పాముతో ఎలా ఫైట్ చేస్తోందో చూస్తే..

కుక్కలు, పిల్లలు కొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. పాములతో ఫైట్ చేసిన కుక్కలను చాలా చూశాం. ఇళ్లల్లోకి చొరబడుతున్న పాములతో ప్రాణాలకు తెగించి పోరాడి తమ యజమానులను కాపాడుతుంటాయి. అలాగే కొన్నిసార్లు పిల్లులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాముతో ఫైట్ చేసిన పిల్లి వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది పిల్లి కాదు పులి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ నాగుపాము (Cobra) ఇంటి ఆవరణలోకి చొరబడుతుంది. పామును చూడగానే ఆ ఇంట్లోని వారంతా పరుగులు పెడతారు. ఓ వ్యక్తి పామును పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో పామును చూసిన పిల్లికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘నా అనుమతి లేకండా నా యజమాని ఇంట్లోకి వస్తావా’’.. అన్నట్లుగా ఆగ్రహంతో (cat attacked the snake) పాముపైకి దూకుతుంది. పాము కూడా పిల్లిపై దాడి చేసి కాటు వేయాలని చూస్తుంది. అయినా పిల్లి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటూ పామును కాలి గోర్లతో రక్కేస్తుంది.

Viral Video: ఫొటో చూసి అబ్బాయిని రిజెక్ట్ చేసింది.. ఆ వెంటనే నవ్వుతూ ఓకే చెప్పింది.. కారణం తెలిస్తే..


పాము ఎంత కాటేయాలని చూసినా పిల్లి మాత్రం ఎంతో తెలివిగా తప్పించుకుంటుంది. కొన్నిసార్లు అటూ ఇటూ జంప్ చేస్తూ పామును తికమకపెడుతుంది. చివరకు దాని యజమాని పాము తోక పట్టుకుని పక్కకు తీసుకెళ్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది పిల్లి కాదు.. పులి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిల్లిని ఎక్కడా చూడలేదు’’.. అంటూ మరికొందరు, ‘‘పొరపాటున కాటు వేస్తే పరిస్థితి ఏంటీ.. అదేపనిగా పిల్లిపై పామును వదలడం కరెక్ట్ కాదు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: జలకాలాడుతున్న యువతిని చూసి జడుసుకుంటున్న జనం.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

Updated Date - May 26 , 2024 | 08:54 PM