Share News

Viral Video: అది వీపా.. లేక కటింగ్ యంత్రమా.. ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - May 26 , 2024 | 05:15 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు చేసిన వినూత్న విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఒక్కమాటలో బాలుడు తన వీపును కటింగ్ యంత్రంలా మార్చేశాడు..

Viral Video: అది వీపా.. లేక కటింగ్ యంత్రమా.. ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా..

మనుషుల్లో మానవాతీత శక్తులు ఉన్న వారిని చాలా మందిని చూస్తుంటాం. ఎవరికీ సాధ్యం కాని పనులను సైతం ఇలాంటి వారు ఎంతో అవలీలగా చేసేస్తుంటారు. బైకును తలపై పెట్టుకుని బస్సుపై లోడ్ చేసిన వ్యక్తిని చూశాం, పెద్ద పెద్ద వాహనాలను తల వెంట్రులతో లాగిన వారిని చూశాం. అలాగే మోచేతులతో పచ్చి టెంకాయలను పగులగొట్టిన వారిని కూడా చూశాం. అయితే అత్యంత శక్తులు ఉన్న చిన్న పిల్లలను చాలా తక్కువగా చూస్తుంటాం. తాజాగా, ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు వీపుతో టెంకాయను పగులగొట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు చేసిన వినూత్న విన్యాసం (Innovative stunt) చూసి అంతా అవాక్కవుతున్నారు. ఒక్కమాటలో బాలుడు తన వీపును కటింగ్ యంత్రంలా మార్చేశాడు. ఓ టెంకాయను తీసుకుని బాలుడి వీపు ఎముకల మధ్యలో పెట్టగా.. దాన్ని అతను (boy broke coconut with his back bones) కటింగ్ యంత్రం తరహాలో క్షణాల్లో కత్తిరించాడు. చివరకు కొబ్బరి పగిలిపోయి లోపలి నుంచి నీళ్లన్నీ బయటికి వస్తాయి. ఆ తర్వాత అతను కొబ్బరిని తింటూ ఎంజాయ్ చేస్తాడు. వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: ఫొటో చూసి అబ్బాయిని రిజెక్ట్ చేసింది.. ఆ వెంటనే నవ్వుతూ ఓకే చెప్పింది.. కారణం తెలిస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిల్లాడి వీపు హైడ్రాలిక్ ప్రెస్ మెషీన్‌‌లా పని చేస్తోందే’’.. అంటూ మరికొందరు, ‘‘అది ఓన్లీ కొబ్బరి కాబట్టి అంత గట్టిగా ఉండదు’’.., ‘‘ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: జలకాలాడుతున్న యువతిని చూసి జడుసుకుంటున్న జనం.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..

Updated Date - May 26 , 2024 | 05:15 PM