Share News

Viral Video: దండ వేయగానే వధువు చేసిన పనికి వరుడు షాక్.. అనుమానంగానే ఆమె మెడలో దండ వేయగా..

ABN , Publish Date - May 26 , 2024 | 09:43 PM

వివాహ కార్యక్రమంలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొన్నిసార్లు వధూవరులు పక్కా పథకం ప్రకారం ప్లాన్ చేస్తే.. మరికొన్నిసార్లు ఊహించని విధంగా ఏవేవో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...

Viral Video: దండ వేయగానే వధువు చేసిన పనికి వరుడు షాక్.. అనుమానంగానే ఆమె మెడలో దండ వేయగా..

వివాహ కార్యక్రమంలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొన్నిసార్లు వధూవరులు పక్కా పథకం ప్రకారం ప్లాన్ చేస్తే.. మరికొన్నిసార్లు ఊహించని విధంగా ఏవేవో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దండ వేయగానే వధువు చేసిన పనికి వరుడు షాక్ అయ్యాడు. అనుమానంగానే ఆమె మెడలో దండ వేయడంతో వధువు ఫైనల్‌గా ఏం చేసిందో చూండండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. వధూవరులు దండలు (bride and groom) మార్చుకుంటున్న సమయంలో వధువు విచిత్రంగా ప్రవర్తిస్తుంది. వరుడి మెడలో దండ వేసిన అనంతరం చప్పట్లు కొడుతూ చిన్న పిల్లలా ఎగిరి గంతేస్తూ సంబరపడిపోతుంది. ఆమె విచిత్ర ప్రవర్తన చూసి వరుడు షాక్ అవుతాడు. ‘‘ఈమేంటీ మరీ మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుందే’’.. అంటూ పక్కన ఉన్న వాళ్ల వైపు చూస్తాడు. అయినా వధువు మాత్రం ముసుగు ధరించి ముసి ముసి నవ్వులు నవ్వుతుంటుంది.

Viral Video: ఇది పిల్లి కాదు పులి.. పాముతో ఎలా ఫైట్ చేస్తోందో చూస్తే..


ఆ తర్వాత వరుడు అనుమానంగానే వధువు మెడలో దండ వేస్తాడు. అలా దండ వేయగానే వధువు మళ్లీ చప్పట్లు కొడుతూ డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది. దీంతో పక్కన ఉన్న వారు కూడా ఒక్కసారిగా అవాక్కవుతారు. చూస్తుంటే ఇదంతా సరదా కోసం అంతా కలిసి కావాలని చేసినట్లు ఉన్నా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువుకు దయ్యం పట్టిందేమో’’.. అంటూ కొందరు, ‘‘వధువు యాక్షన్ చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఫొటో చూసి అబ్బాయిని రిజెక్ట్ చేసింది.. ఆ వెంటనే నవ్వుతూ ఓకే చెప్పింది.. కారణం తెలిస్తే..

Updated Date - May 26 , 2024 | 10:44 PM