Share News

PM Modi: కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చింది.. ప్రధాని మోదీ విసుర్లు

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:58 PM

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. కర్ణాటక శివమొగ్గలో సోమవారం నాడు మోదీ పర్యటించారు. కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చిందని విమర్శించారు. ప్రతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెబుతోందని స్పష్టం చేశారు. ఆ సంప్రాదాయం కర్ణాటకలో కొనసాగిందని వివరించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకోబోతుందని మరోసారి మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

PM Modi: కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చింది.. ప్రధాని మోదీ విసుర్లు

శివమొగ్గ: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ (PM Modi) బిజీగా ఉన్నారు. కర్ణాటక శివమొగ్గలో సోమవారం నాడు మోదీ పర్యటించారు. కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ (Congress) పార్టీ ఏటీఎంగా మార్చిందని విమర్శించారు. ప్రతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెబుతోందని మోదీ (PM Modi) స్పష్టం చేశారు. ఆ సంప్రాదాయం కర్ణాటకలో కొనసాగిందని వివరించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకోబోతుందని మోదీ (PM Modi) విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి సీట్లు పెంచే బాధ్యత కర్ణాటక ప్రజలపై ఉందని వివరించారు. శివమొగ్గలో జరిగిన బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీ (PM Modi) ప్రసంగించారు.

‘జూన్ 4వ తేదీన 400 సీట్లతో ఎన్డీఏ కూటమి నిలుస్తోంది. ఇందులో కర్ణాటక ప్రజలపై పెద్ద బాధ్యత ఉంది. 400 సీట్లు ఎందుకు అంటే.. 400 అంటే వికసిత్ భారత్, వికసిత్ కర్ణాటక అని’ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శక్తిని నాశనం చేస్తానని ఇండియా కూటమి ప్రతిజ్ఞ చేసింది. శక్తిపై వార్ అంటే మహిళలు, ఆడ బిడ్డలు, కన్న తల్లి అని స్పష్టం చేశారు. ముంబై శివాజీ పార్క్ నుంచి శక్తిని నాశనం చేయాలనే ప్రకటన వచ్చింది. ఆ మాటలు బాలాసాహెబ్ ఠాక్రే ఆత్మను క్షోభించి ఉంటుంది. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 05:00 PM