Share News

Congress: నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..? గాంధీలు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్..?

ABN , Publish Date - Mar 08 , 2024 | 08:16 AM

లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో గల కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గురువారం సమావేశమై చర్చించింది. సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ పాల్గొన్నారు. భారత్ న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ వర్చువల్‌గా పాల్గొనాలి. అనివార్య కారణాల వల్ల పాల్గొనలేదు.

Congress: నేడే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..? గాంధీలు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్..?

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ (Congress) కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో గల కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గురువారం సమావేశమై చర్చించింది. సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge), సోనియా గాంధీ (Sonia Gandhi) పాల్గొన్నారు. భారత్ న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) వర్చువల్‌గా పాల్గొనాలి. అనివార్య కారణాల వల్ల పాల్గొనలేదు.

గాంధీలు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్

బీజేపీ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితా ఈ రోజు రానుంది. అనారోగ్య కారణాల వల్ల ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని సోనియా గాంధీ ఇదివరకే ప్రకటన చేశారు. పెద్దల సభ రాజ్యసభకు ఇటీవల ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi) , ప్రియాంక గాంధీ పోటీ చేసే స్థానంపై స్పష్టత రావడం లేదు.

వాయనాడు..? లేదా అమేథి

2019లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాంగ్రెస్ కంచుకోట అమేథితోపాటు కేరళలో గల వాయనాడు నుంచి బరిలోకి దిగారు. అనూహ్యంగా అమేథి నుంచి ఓడిపోయారు. రాహుల్‌ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. వాయనాడు నుంచి మాత్రం రాహుల్ గాంధీ విజయం సాధించారు. మరోసారి ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగాలని కేరళ స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై ఎలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుకోలేదు. పోటీ చేసే స్థానంపై నిర్ణయాన్ని రాహుల్ గాంధీకే వదిలేసినట్టు తెలుస్తోంది.

ప్రియాంక ఎంట్రీ

రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోదరి ప్రియాంక గాంధీ రాజకీయ రంగ ప్రవేశంపై అరంగ్రేటంపై ఉత్కంఠ నెలకొంది. ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. కాంగ్రెస్ మరో కంచుకోట రాయ్ బరేలి నుంచి సోనియా గాంధీ తప్పుకున్నారు. ఇక్కడినుంచి పోటీ చేయాలని ప్రియాంకను కోరుతున్నారు. ఇప్పటికే రాయ్ బరేలిలో ప్రియాంక పోస్టర్లు వెలిశాయి. మరి ప్రియాంక నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా ఈ రోజు రానుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేసే స్థానాలపై మాత్రం సస్పెన్స్ నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 08:16 AM