Share News

CM Revanth: ఆమెతో నాకు పోటీనా.. డీకే అరుణపై సీఎం రేవంత్ పంచులు

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:55 PM

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

CM Revanth: ఆమెతో నాకు పోటీనా.. డీకే అరుణపై సీఎం రేవంత్ పంచులు
CM Revanth Reddy

నారాయణ పేట జిల్లా: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మంగళవారం నాడు నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మహబూబ్ నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ క్యాడర్‌కు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.


Lok Sabha Election 2024: ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు వీళ్లే! కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరెవరంటే?

కొడంగల్ ఆ స్థాయికి ఎదిగింది

ఈ సమావేశం అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు 7 వేల మెజార్టీతో తనను గెలిపించి ఎమ్మెల్యే చేశారని.. నేడు 30 వేల మెజార్టీతో సీఎంగా చేశారని అన్నారు. ఇప్పుడు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ మనపై ప్రేమతో సీఎం పదవి ఇచ్చారని.. టీపీసీసీ చీఫ్ పదవి ఏకకాలంలో ఇచ్చారని తెలిపారు. చేయి చాపి అడిగే స్థాయి నుంచి.. ఇప్పుడు రాష్ట్రంలో ఏది కావాలన్నా ఇచ్చే స్థాయికి ఈ కొడంగల్ ఎదిగిందని ఉద్ఘాటించారు.


Komatireddy: నీకు సుఖేందర్ చాలు... జగదీష్‌రెడ్డిపై కోమటిరెడ్డి సెటైర్

నాకు శత్రువులు.. ప్రత్యర్థులు లేరూ..

బీజేపీ మహబూబ్‌గర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణపై రేవంత్ పంచుల వర్షం కురిపించారు. ‘నరేంద్ర మోదీ కత్తి.. పాలమూరు కడుపులో పొడిచేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె (డీకే అరుణ)తో నాకు పోటీ లేదు. మీ సొంత ఊరిలోనే మీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.. మీకు నాకు ఏం పోటీ. కొడంగల్‌ను దొంగ దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారు. ఆనాడు మంత్రిగా ఉన్న అరుణ.. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నారు. నేను సీఎంను.. నాకు పాలమూరులో శత్రువులు.. ప్రత్యర్థులు ఎవ్వరూ లేరు’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


పాలమూరు జిల్లాను ఆగం పట్టించిన కేసీఆర్

70 ఏళ్ల తర్వాత పాలమూరుకు సువర్ణ అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని సూచించారు. మనం ఆదరించి గెలిపించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్లు పాలమూరు జిల్లాను ఆగం పట్టించారని విరుచుకుపడ్డారు. ఆయన సొంత ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని ధ్వజమెత్తారు. పార్టీలకు అతీతంగా ఈ ఐదేళ్లు ఏ ఎన్నిక వచ్చినా తనకు అండగా ఉండాలని కోరారు. పదేళ్లు కేసీఆర్ చేసిన మోసం నుంచి బయటికి వస్తున్నామన్నారు. అలాంటిది తనను దించుతానంటున్నాడని... తాను సీఎంగా రూ.3000 కోట్ల లోటు బడ్జెట్‌తో ఆ పదవి స్వీకరించానని తెలిపారు. తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.


ఆగస్టు 15 లోపుల రుణ మాఫీ...

మంచి పరిపాలన చేస్తూ.. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. 15 ఆగస్టు లోపుల తాను రుణమాఫీ చేస్తానని అంటే.. మాజీ మంత్రి హరీశ్‌‌‌రావు కాదని అంటున్నారన్నారు. మరి తాను రుణమాఫీ చేస్తే.. ఆయన పార్టీని బంద్ చేస్తారా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రైతుల వడ్లు కొనడమే కాదు.. రూ. 500 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో గెలిచి.. రచ్చ గెలవాలని అంటారని.. మన ఇల్లు కొడంగల్.. ఇక్కడ మనం పెద్ద మెజార్టీతో గెలవాలని కోరారు. బీజేపీ నేతలకు పిచ్చి పట్టిందని ఆరోపించారు. తామంతా హిందువులం.. పూజలు చేసిన వాళ్లమేనని భక్తి మన గుండెల్లో ఉండాలన్నారు. వారు గోడలమీద రాస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ పదేళ్లు తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. అందుకే సమాజంలో డివిజన్ తెచ్చి గెలవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Breaking: కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 06:35 PM