Share News

Dhulipalla: జగన్ ఇచ్చేది రూపాయి.. దోచుకునేది పది రూపాయలు

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:15 PM

Andhrapradesh: పాత వైసీపీ నాయకులకు, కొత్త వైసీపీ నాయకులకు తనను విమర్శించడం అలవాటైందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు రెవిన్యూ లోటు ఉందన్నారు. ఒక్క పైసా ప్రజల మీద భారం వేయకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగించారన్నారు. పీపీఏల రద్దు పేరుతో పెట్టుబడి పెట్టిన వారిని ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు.

Dhulipalla: జగన్ ఇచ్చేది రూపాయి.. దోచుకునేది పది రూపాయలు

గుంటూరు, మార్చి 9: పాత వైసీపీ నాయకులకు, కొత్త వైసీపీ నాయకులకు తనను విమర్శించడం అలవాటైందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (TDP Leader Dhulipalla Narendra) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు రెవిన్యూ లోటు ఉందన్నారు. ఒక్క పైసా ప్రజల మీద భారం వేయకుండా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) పరిపాలన సాగించారన్నారు. పీపీఏల రద్దు పేరుతో పెట్టుబడి పెట్టిన వారిని ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో వేలకోట్ల రూపాయల దోపిడీకి ఈ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. విద్యుత్ చార్జీల పేరుతో ప్రజల మీద భారం మోపారని మండిపడ్డారు. వీటీపీఎస్‌ను కుట్రపూరితంగా ప్రభుత్వం మూసివేసిందన్నారు.

జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Reddy) ప్రజలకు ఇచ్చేది రూపాయని... ప్రజల వద్ద నుంచి దోచుకునేది పది రూపాయలని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పొన్నూరు నియోజకవర్గంలో అదనంగా విద్యుత్ చార్జీలు రూపంలో 32.09 కోట్ల రూపాయలు భారం ప్రజల మీద వేసిందన్నారు. జగన్ అధికారం చేపట్టాక పన్నులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల మీద 50వేల కోట్ల రూపాయల భారం మోపారని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ బిల్లుల పేరుతో సంక్షేమ పథకాలకు కోత పెట్టారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలను ఓటు అడిగే నైతిక అర్హత లేదని ధూళిపాళ్ల నరేంద్ర కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి...

PM Modi: ఏనుగుపై మోదీ సవారీ.. ఎక్కడంటే..?

AP News: జగన్ పాలన ఎలా ఉందనే దానికి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి ఉండదు..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2024 | 12:27 PM