Share News

NDA బీజేపీ- టీడీపీ మధ్య మళ్లీ దోస్తి.. ఆరేళ్ల తర్వాత కూటమిలోకి తెలుగుదేశం

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:37 PM

ఆరేళ్ల తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరబోతుంది. వచ్చే లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేయనుంది. ఢిల్లీలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మకాం వేశారు. పోటీ చేసే స్థానాల గురించి బీజేపీ నేతలతో సుధీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ- జనసేన మధ్య సీట్ల షేరింగ్ జరిగింది. ఆయా చోట్ల బీజేపీ కోరడంతో చర్చలు కంటిన్యూ అవుతున్నాయి.

NDA బీజేపీ- టీడీపీ మధ్య మళ్లీ దోస్తి.. ఆరేళ్ల తర్వాత కూటమిలోకి తెలుగుదేశం

అమరావతి: ఆరేళ్ల తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కూటమిలో తెలుగుదేశం పార్టీ (TDP) చేరబోతుంది. వచ్చే లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేయనుంది. ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మకాం వేశారు. పోటీ చేసే స్థానాల గురించి సుధీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ- జనసేన మధ్య సీట్ల షేరింగ్ జరిగింది. ఆయా చోట్ల బీజేపీ కోరడంతో చర్చలు సుధీర్ఘంగా జరుగుతున్నాయి.

ఏమైంది అంటే..?

తెలుగుదేశం పార్టీ- భారతీయ జనతా పార్టీ మధ్య తొలి నుంచి స్నేహబంధం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా బీజేపీతో టీడీపీ కలిసి ఉంది. 2018లో రాష్ట్రానికి నిధుల విషయంలో విభేదాలు వచ్చాయి. ఆ సమయంలో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. 2019లో కేంద్రంలో ఎన్డీఏ విజయం సాధించింది. ఏపీలో వైసీపీ గెలుపొందింది. చాలా టీడీపీ- బీజేపీ మధ్య గ్యాప్ వచ్చింది. ఇన్నాళ్లకు రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లబోతున్నాయి.

ఇది కూడా చదవండి: BJP, TDP, Janasena:నేడు మళ్ళీ బీజేపీ పెద్దలతో భేటీకానున్న బాబు, పవన్

10 లోపు ప్రకటన..?

9 అసెంబ్లీ 5 లోక్ సభ సీట్లను బీజేపీ అడిగినట్టు తెలుస్తోంది. శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ (నార్త్), ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ కోరుతుంది. వీటితోపాటు తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం లోక్ సభ సీట్ల కోసం పట్టుబడుతోంది. సీట్ల కేటాయింపుపై స్తబ్ధత నెలకొంది. ఈ నెల 10వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థులను ప్రకటించనుంది. ఆ లోపు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది.

కలిసి పోరాటం

లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలను టీడీపీ జనసేన, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కలిసి బరిలోకి దిగి వైసీపీని గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్నాయి. ఏపీలో ఉన్న సమస్యలే ఏజెండాగా ముందుకెళ్లనున్నాయి. జగన్ హయాంలో జరిగిన తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉంది. కరెంట్ సమస్య, ఇసుక కొరత, కొందరు వాలంటీర్ల అనుచిత ప్రవర్తనను ప్రధాన అస్త్రాలుగా తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: BJP, TDP, Janasena:నేడు మళ్ళీ బీజేపీ పెద్దలతో భేటీకానున్న బాబు, పవన్

Updated Date - Mar 08 , 2024 | 02:37 PM