Share News

AP Elections: నెల ముందే జీతం.. అదనంగా డబుల్ బోనస్.. వాలంటీర్ల రాజీనామా వెనుక అసలు కథ..

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:22 PM

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామా అంటూ గత కొద్దిరోజులుగా ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. జగన్‌పై అభిమానంతో వైసీపీకి మద్దతుగా వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు విపక్షాల కారణంగా తమ వాలంటీర్ పోస్టు పోయిందని, ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే మళ్లీ తమ ఉద్యోగం వస్తుందంటూ ఇంటింటికి వెళ్లి వైసీపీ తరపున వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తద్వారా సానుభూతితో ఓట్లు వేయించుకునేందుకు వాలంటీర్లకు తెలియకుండానే వైసీపీ ఓ పెద్ద ప్లాన్‌కు తెరలేపింది.

AP Elections: నెల ముందే జీతం.. అదనంగా డబుల్ బోనస్.. వాలంటీర్ల రాజీనామా వెనుక అసలు కథ..
Jagan and Volunteers

రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామా అంటూ గత కొద్దిరోజులుగా ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. జగన్‌(YS Jagan)పై అభిమానంతో వైసీపీ(YSRCP)కి మద్దతుగా వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు విపక్షాల కారణంగా తమ వాలంటీర్ పోస్టు పోయిందని, ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే మళ్లీ తమ ఉద్యోగం వస్తుందంటూ ఇంటింటికి వెళ్లి వైసీపీ తరపున వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తద్వారా సానుభూతితో ఓట్లు వేయించుకునేందుకు వాలంటీర్లకు తెలియకుండానే వైసీపీ ఓ పెద్ద ప్లాన్‌కు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు రాజీనామా చేయాలని స్థానిక వైసీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం మళ్లీ వైసీపీ రాకపోతే తమకు ఉన్న ఉపాధి పోతుంది.. టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే తమ వేతనం రెట్టింపు చేస్తామంటున్నారనే ఉద్దేశంతో రాజీనామాకు ససేమిరా అంటున్నారు. దీంతో రాజీనామా చేస్తే మూడు నెలల వేతనం మేమే ఇస్తామని.. రాజీనామా పత్రం ఇవ్వగానే ఒక నెల జీతం ముందే ఇస్తున్నారు.. అలా నెల ప్రారంభంలోనే రాజీనామా చేసిన వాలంటీర్‌కు రూ.5వేలు ఇచ్చేందుకు స్థానిక నాయకులు ఒప్పందం చేసుకుంటున్నారు.


నెలముందే వేతనం..

వాలంటీర్‌గా పనిచేస్తే నెల పూర్తైన తర్వాత మొదటి వారంలో గౌవర వేతనం వాలంటీర్ అకౌంట్‌లో జమవుతుంది. మార్చి వేతనం ఏప్రిల్‌లో వేశారు. ఏప్రిల్‌కు సంబంధించిన వేతనం మేలో వేస్తారు. అదే రాజీనామా చేస్తే మేలో రావల్సిన వేతనం ముందే ఇస్తుండటంతో పాటు వైసీపీ ప్రభుత్వం వస్తే మీ పోస్టు మీకేనంటూ హామీ ఇస్తున్నారు. దీంతో కొందరు వాలంటీర్లు ముందే జీతం ఇస్తున్నారనే ఉద్దేశంతో రాజీనామా చేస్తుంటే మరికొందరు మాత్రం ఆ ప్రతిపాదనలకు దూరంగా ఉంటున్నారు. వేతనంతో పాటు.. ఎన్నికలు అయ్యేవరకు పార్టీ ప్రచారంలో పాల్గొంటే రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఏరోజు డబ్బులు ఆ రోజే ఇస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో ఓవైపు రూ.5వేల వేతనంతో పాటు.. రోజులో గంట నుంచి రెండు గంటలు ప్రచారం చేస్తే నెలకు మరో 10 నుంచి 15 వేలు అదనంగా వస్తాయనే ఉద్దేశంతో వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. దీనిని వక్రీకరించి సానుభూతి పొందేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొంతమంది వాలంటీర్లు అసలు విషయం బయటకు చెప్పడంతో వైసీపీ కుట్ర బయటపడుతోంది.

Chandrababu: ట్విటర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్..


తీవ్ర ఒత్తిడి

రాజీనామా చేయాలంటూ కార్పొరేషన్ల పరిధిలో వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపాల్టీల పరిధిలో వైసీపీ కౌన్సిలర్లు, గ్రామాల పరిధిలో వైసీపీ మద్దతుదారులుగా ఉన్న సర్పంచ్‌లు వాలంటీర్లపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయకపోతే మళ్లీ ప్రభుత్వం వస్తే మిమల్ని కొనసాగించబోమని కొందరు బెదిరిస్తున్నారట. ప్రభుత్వం రాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తుంటే.. మీకు మూడు నెలల వేతనంతో పాటు ఎన్నికలు అయ్యే వరకు ప్రచారం చేస్తే మీ ఖర్చులు భరించడంతో పాటు.. కొంత మొత్తాన్ని ఇస్తామని చెబుతున్నారు. అలాగే మరికొంతమంది అయితే ఏదో ఒకటి చేసి మళ్లీ వాలంటీర్లుగా పెట్టిస్తామని నచ్చజెపుతున్నారట.


వ్యతిరేకతను గమనించి..

ప్రజల్లో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని గమనించిన వైసీపీ.. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా వాలంటీర్ల రాజీనామా అంటూ ఓ సరికొత్త కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. వైసీపీ కుయుక్తులను గమనిస్తున్న ఓటర్లు మాత్రం తమను ఎంత మభ్యపెట్టినా.. ఈసారి వైసీపీ మాయలో పడబోమంటున్నారట. ఎన్ని కుట్రలకు తెరలేపిన కూటమికే తమ ఓటు అని వైసీపీ నాయకులకు తేల్చిచెబుతుండటంతో అధికార పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రోజుకో కుట్రకు జగన్ ప్రభుత్వం తెరలేపుతున్నట్లు స్పష్టమవుతోంది.


Kanakamedala Ravindra Kumar: అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్...

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 01:38 PM