Share News

Chandrababu: ట్విటర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్..

ABN , Publish Date - Apr 20 , 2024 | 11:57 AM

ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు కావడంతో మరింత గ్రాండ్‌గా అభిమానులు జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ట్విటర్ వేదికగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Chandrababu: ట్విటర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్..

అమరావతి: ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు కావడంతో మరింత గ్రాండ్‌గా అభిమానులు జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ట్విటర్ వేదికగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, తెలుగు ప్రజలు ట్విటర్ వేదికగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ట్విటర్‌లో HBDBabu హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

AP Politics: అవినాశ్‌రెడ్డిపై మూడు కేసులు.. అవేంటంటే..


ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆమె క్యాంప్ సైట్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. కేక్ కట్ చేసి పార్టీ నేతలకు, కార్యకర్తలకు పంచారు. అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదాన కార్యక్రమానికి సైతం నారా భువనేశ్వరి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నాయకులంతా తమ అభిమానాన్ని చంద్రబాబుపై పెద్ద ఎత్తున కురిపిస్తున్నారు. చంద్రబాబు పుట్టినరోజును పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైకిల్ ర్యాలీలు, అన్న దానాలు వంటివి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

Chandrababu: భువనేశ్వరి క్యాంపు సైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు...

Bonda Uma: నాపై ఓ యుద్దానికి వచ్చినట్టు పోలీసులను పంపారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 11:58 AM