Share News

AP Politics: అవినాశ్‌రెడ్డిపై మూడు కేసులు.. అవేంటంటే..

ABN , Publish Date - Apr 20 , 2024 | 10:26 AM

సార్వత్రిక ఎన్నికలకు(Lok Sabha Elections) సంబంధించి అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో(Election Affidavit) తమకు ఉన్న ఆస్తులు, అప్పులతోపాటు తమపై నమోదైన కేసుల(Police Cases) వివరాలను కూడా వెల్లడించారు. వీటిలో సీఎం జగన్‌ సోదరుడు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సమర్పించిన..

AP Politics: అవినాశ్‌రెడ్డిపై మూడు కేసులు.. అవేంటంటే..
YS Avinash Reddy

  • వివేకా హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం కేసూ

  • పోలీసు స్టేషన్‌లోనే అధికారులను బెదిరించిన కేసుల్లో దువ్వాడ శ్రీనివాస్‌

  • బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై 2020లో హత్యాయత్నం కేసు

  • అఫిడవిట్లలో వెల్లడించిన వైసీపీ అభ్యర్థులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): సార్వత్రిక ఎన్నికలకు(Lok Sabha Elections) సంబంధించి అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో(Election Affidavit) తమకు ఉన్న ఆస్తులు, అప్పులతోపాటు తమపై నమోదైన కేసుల(Police Cases) వివరాలను కూడా వెల్లడించారు. వీటిలో సీఎం జగన్‌ సోదరుడు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల మేరకు ఆయనపై వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు నమోదైంది. సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. హత్యానేరం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. ఇది కాకుండా మరో రెండు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇక, ఆస్తుల విషయానికి వస్తే అవినాశ్‌కు రూ.25.51 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అప్పులు రూ.9.11 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య సమత పేరిట విశాఖపట్టణం, వల్లూరు, ఊటుకూరు, పొనకమిట్లలో 33.90 ఎకరాల భూమి ఉంది. అవినాశ్‌ రెడ్డి భార్య ఆస్తుల విలువ రూ.7.34 కోట్లుగా ఉంది.


పోలీసులపైనే దువ్వాడ దురుసు..

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన దువ్వాడ శ్రీనివాస్‌పై రాష్ట్రంలో నాలుగు కేసులు, ఒడిశాలో రెండు కేసులు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌లో అధికారులపై దురుసుగా ప్రవర్తించినందుకు, ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడం, బెదిరించడం వంటి సంఘటనలకు సంబంధించి ఈ కేసులు నమోదయ్యాయి. ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాఖిమిడిలో 2010లో గనులు, భూగర్భశాఖకు సంబంధించి కట్టాల్సిన పన్నులు ఎగవేయడంతో ఓ కేసు పర్లాఖిమిడి కోర్టులో నడుస్తోంది. 2012లో ఆస్తుల మోసంపై మరోకేసు నమోదైంది. ఒడిశాలో ఐటీకి సంబంధించి(రూ.18 లక్షలు) ఓ కేసు ఉంది. అలాగే కమర్షియల్‌ ట్యాక్స్‌కు సంబంధించి(రూ.16.86 లక్షలు) మరో కేసు ఉంది.


నందిగంపై హత్యాయత్నం కేసు..

బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో 2020లో హత్యాయత్నం కేసు నమోదయింది. ఇప్పటి వరకు చార్జిషీట్‌ ఫైల్‌ చేయలేదు. నందిగం సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయం బహిర్గతమైంది.

ఇవి కూడా చదవండి:

ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచాడు.. చంద్రబాబు సంచలన ఆరోపణలు..

టచ్‌ చేసి చూడు! హైటెన్షన్‌ వైరులా ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 20 , 2024 | 11:47 AM