Share News

Kanakamedala Ravindra Kumar: అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్...

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:35 PM

ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెరగని ముద్ర వేశారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కనకమేడల ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారన్నారు.

Kanakamedala Ravindra Kumar: అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్...

ఢిల్లీ: ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చెరగని ముద్ర వేశారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కనకమేడల ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారన్నారు. అభివృద్ధి మార్గదర్శి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఒక పండుగ. అభివృద్ధి సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అని కనకమేడల ప్రశంసించారు.

ఒక్క చాన్సే చివరి చాన్స్‌ కావాలి! జగన్‌ నైజం దోపిడీ, విధ్వంసమే: చంద్రబాబు


ఏపీ రాష్ట్ర అనేక ఏళ్లుగా అటుపోటులకు గురి అవుతోందన్నారు. రాష్టం విడిపోయిన ప్రతిసారి 20 ఏళ్లు వెనక్కి పోతోందని కనకమేడల అన్నారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ను అత్యధిక సంపద సృష్టించే విధంగా చంద్రబాబు తీర్చిదిద్దారన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా మరో సైబర్ సిటీని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రం విడిపోయనప్పుడు హైదరాబాద్ ఆదాయం తెలంగాణకి వెళ్లితే, ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు ఉన్నారని గతంలో వెంకయ్య నాయుడు చెప్పారని.. అది చంద్రబాబు నాయుడు గొప్పతనమని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.

AP Elections: తూర్పున యుద్ధమే.. ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో?


ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో రాజధాని కొరకు భూమి సేకరించారని కనకమేడల అన్నారు. ఇలాంటిది ఎక్కడ ఎవరూ చేయలేదని.. దాని ఫలితమే అమరావతి రాజధాని అని పేర్కొన్నారు. జగన్ విధ్వంసకర ఆలోచనలతో అమరావతిని తిరోగమనం చేశారన్నారు. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు కు చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు చేసిన పనులను ఇతరులు కొనసాగించారన్నారు. అమరావతిని జగన్ మాత్రం తిరోగమనంలోకి తీసుకెళ్ళారన్నారు. జగన్ నేతృత్వంలో ఏపీ అల్లకల్లోలం అయ్యిందని కనకమేడల అన్నారు.

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారు?

AP Elections: తూర్పున యుద్ధమే.. ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 12:35 PM