Share News

Pawan Kalyan: ఈ జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి.. పవన్ ఇంట్రస్టింగ్ ట్వీట్..

ABN , Publish Date - May 08 , 2024 | 10:05 PM

విజయవాడలో టీడీపీ-బీజేపీ-జనసేన (ఎన్డీయే) కూటమి చేపట్టిన రోడ్‌ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్‌ షోపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

Pawan Kalyan: ఈ జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి.. పవన్ ఇంట్రస్టింగ్ ట్వీట్..
Pawan Kalyan

అమరావతి, మే 08: విజయవాడలో టీడీపీ-బీజేపీ-జనసేన (ఎన్డీయే) కూటమి చేపట్టిన రోడ్‌ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్‌ షోపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. రోడ్‌ షోలో పాల్గొన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి థ్యాంక్స్ చెప్పారు పవన్. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. మోదీ కలలు కన్న వికసిత భారత్ కోసం తామంతా అవిశ్రాంతంగా కృషి చేస్తామని అన్నారు.


పవన్ కల్యాణ్ పోస్ట్ సారాంశం..

‘ప్రధాని నరేంద్ర మోడీ గారూ.. ఏపీలో ప్రచారం కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మా కృతజ్ఞతలు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మాకు గుర్తుండిపోతాయి. మీరు అనుకున్న వికసిత్‌ భారత్‌ కోసం మేమంతా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


కూటమి రోడ్ షో సూపర్ హిట్..

బెజవాడలో ఎన్డీయే కూటమి నిర్వహించిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. ఆయనతో పాటు రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. బెజవాడలోని పివిపి మాల్ నుండి బెంజ్ సర్కిల్ వరకూ గంటసేపు రోడ్ షో చేపట్టారు. కృష్ణాజిల్లాలోని దారులన్ని బెజవాడ రోడ్ షో వైపే మళ్లాయి. ప్రధాని మోదీ రోడ్‌ షో.. ఎన్డీయే కూటమిలో కొత్త జోష్ నింపింది. బందరు రోడ్డు జనసంద్రంతో కిక్కిరిసింది. ఏపీలో ప్రధాని మోడీ చేపట్టిన చివరి ఎన్నికల ప్రచార యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బెజవాడ రోడ్లపై కూటమికి మద్దతుగా అడుగులో అడుగేశారు ఉమ్మడి క్రిష్ణా జిల్లా వాసులు. రోడ్ షో గ్రాండ్ సెక్సస్ కావడంతో కూటమి నేతల్లో జోష్ పెరిగింది. కూటమి విజయం తథ్యం అంటూ రోడ్ షోకు వచ్చిన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 08 , 2024 | 10:05 PM