అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని.. అలాకాకపోతే పూర్తిగా లొంగిపోవాలని తేల్చి చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలపై క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు (సోమవారం) నుంచే ఇరాన్‌తో అమెరికా చర్చలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అన్నారు.
భారత్ పాక్ యుద్ధాన్ని తాను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. సుంకాలతో బెదిరించి యుద్ధాన్ని ఆపేలా చేశానని చెప్పారు.
ఇరాన్‌తో సైనిక ఘర్షణలు 6వ నెలకు చేరుకున్నప్పటికీ ముగింపునకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఉన్నత సలహాదారుల బృందంలో తీవ్ర భేదాభిప్రాయాలే దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా అంటోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రం అవుతున్నాయి. తాజాగా ఇరాన్ ఓ చైనా కంపెనీపై దాడి చేసింది.
అమెరికాలో యూ వీసా పొందేందుకు నకిలీ దోపిడీలకు పాల్పడిన కేసులో ఓ భారతీయుడికి కోర్టు జైలు శిక్ష, జరిమానాతో పాటు దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. మసాచుసెట్స్‌కు చెందిన మితుల్ పటేల్ ఈ మోసానికి పాల్పడటంతో బోస్టన్లోని ఫెడరల్ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ మిసైల్స్ దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై శక్తివంతమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు.
రష్యాపై మరింత కఠిన ఆర్థిక ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ కలిసి రూపొందించారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న దౌత్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశావహంగా స్పందించారు. అమెరికా, ఇరాన్ వరుసగా మూడో రోజూ పరస్పర దాడులను నిలిపివేయడంతో శాంతి చర్చల్లో పురోగతి సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.