Share News

ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

ABN , Publish Date - May 13 , 2026 | 02:49 PM

అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన రెండో దఫా శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) మొండి పట్టుదల వల్లే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కుదరడం లేదని అమెరికా ఆగ్రహంగా ఉంది.

ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..
IRGC funding

అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన రెండో దఫా శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) మొండి పట్టుదల వల్లే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కుదరడం లేదని అమెరికా ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది (IRGC funding).


ఐఆర్‌జీసీ ఆర్థిక మూలల గురించి చెప్పిన వారికి 15 మిలియన్ డాలర్లు (రూ.145 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐఆర్‌జీసీ, దాని సంబంధిత శాఖలకు ఆర్థిక వనరులను అందించే బినామీ కంపెనీలు, వ్యక్తులు, ఆర్థిక సంస్థల సమాచారాన్ని తమకు అందిస్తే ఆ బహుమతి ఇస్తామని పేర్కొంది. గల్ఫ్ దేశాలపై దాడులు జరగకుండా ఉండేందుకు, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించేందుకు తమకు ఆ సమాచారం కావాలని కోరింది (Iran military funding).


కాగా, శాంతి చర్చల్లో భాగంగా తాము ప్రతిపాదించిన అంశాలను అంగీకరించడం తప్ప అమెరికాకు మరో మార్గం లేదని ఇరాన్ తేల్చి చెప్పింది (US Iran news). యుద్ధం ముగించేందుకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని వినియోగించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Updated Date - May 13 , 2026 | 02:49 PM