Share News

వచ్చే వారం ఇస్లామబాద్‌కు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు.. శాంతి చర్చలు జరగబోతున్నాయా..

ABN , Publish Date - May 09 , 2026 | 11:37 AM

ఇరాన్, అమెరికా మధ్య కీలక శాంతి చర్చలు వచ్చే వారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వచ్చే వారం ఇస్లామబాద్‌కు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు.. శాంతి చర్చలు జరగబోతున్నాయా..
Islamabad talks 2026

ఇరాన్, అమెరికా మధ్య కీలక శాంతి చర్చలు వచ్చే వారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు, అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు కొనసాగించేందుకు ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి (Iran US talks).


ఇరు దేశాలు 14 పాయింట్ల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ప్రతిపాదనలో కాల్పుల విరమణ, హోర్ముజ్ జలసంధి పరిస్థితి, ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సడలింపులు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయని సమాచారం. చర్చలు సానుకూలంగా మొదలైతే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది (Islamabad talks 2026).


వచ్చే వారం జరగబోతున్న ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించనుంది (US Iran peace talks). ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా ఈ రెండు దేశాల మధ్య ఏప్రిల్‌లో జరిగిన మొదటి దఫా శాంతి చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు మొదలు కాకముందే రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం ఇరు దేశాలు చర్చలను కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నాయని సమాచారం.


ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..


స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 09 , 2026 | 11:37 AM