Share News

అమెరికాకు ఇరాన్ కలిగించిన నష్టం ఎంతంటే.. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ తర్వాత..

ABN , Publish Date - May 07 , 2026 | 01:55 PM

అమెరికా పైకి చెబుతున్న దాని కంటే ఆ దేశానికి యుద్దం వల్ల ఎక్కువ నష్టమే కలిగిందని తాజాగా 'ది వాషింగ్టన్ పోస్ట్' విశ్లేషించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నాటి నుంచి ఇరాన్ విడుదల చేసిన 100కు పైగా ఉపగ్రహ చిత్రాలను 'ది వాషింగ్టన్ పోస్ట్' విశ్లేషించి నష్టాన్ని అంచనా వేసింది.

అమెరికాకు ఇరాన్ కలిగించిన నష్టం ఎంతంటే.. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ తర్వాత..
US military bases damage

అమెరికా పైకి చెబుతున్న దాని కంటే ఆ దేశానికి యుద్దం వల్ల ఎక్కువ నష్టమే కలిగిందని తాజాగా 'ది వాషింగ్టన్ పోస్ట్' విశ్లేషించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నాటి నుంచి ఇరాన్ విడుదల చేసిన 100కు పైగా ఉపగ్రహ చిత్రాలను 'ది వాషింగ్టన్ పోస్ట్' విశ్లేషించి నష్టాన్ని అంచనా వేసింది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలలో కనీసం 228 నిర్మాణాలు, ఖరీదైన యుద్ధ పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది (Iran US war).


ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల్లో హ్యాంగర్లు, రాడార్ వ్యవస్థలు, ఇంధన నిల్వ కేంద్రాలు, విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తీవ్రంగా నాశనమయ్యాయి. ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. కొన్ని శాటిలైట్ చిత్రాల్లో కాలిపోయిన భవనాలు, ధ్వంసమైన రన్‌వేలు, యుద్ధ విమానాలు కనిపించాయి. కాగా, ధ్వంసమైన సైనిక స్థావరాలను తిరిగి నిర్మించుకోవడానికి అమెరికాకు సుమారు 50 బిలియన్ డాలర్లు (రూ. 4.7 లక్షల కోట్లు) ఖర్చవుతుందని 'ది వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది (US military bases damage).


కాగా, పశ్చిమాసియా ఉపగ్రహ చిత్రాలను అందించే రెండు వాణిజ్య సంస్థలైన 'వాంటోర్', 'ప్లానెట్‌'లకు ట్రంప్ బృందం ఓ విజ్ఞప్తి చేసిందట (Satellite images Iran war). పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాల విడుదలను నిలిపివేయాలని కోరిందట. అందువల్లే అమెరికాకు జరిగిన నష్టాల పరిధిని అంచనా వేయడం కష్టంగా మారిందని 'ది వాషింగ్టన్ పోస్ట్' నివేదించింది. ఇరాన్ విడుదల చేసిన 128 ఉపగ్రహ చిత్రాలపై ఆధారపడి తాము విశ్లేషణ చేసినట్టు పేర్కొంది. ఆ ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి, ఏ ఒక్కటీ ఎడిట్ చేసినది కాదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ విశ్లేషణ చేసినట్టు తెలిపింది.


ఇవి కూడా చదవండి..

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి


పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Updated Date - May 07 , 2026 | 02:00 PM