Share News

అమెరికాలో విషాదం.. తెలుగు టెకీని బలి తీసుకున్న వ్యాలీ ఫీవర్..

ABN , Publish Date - May 11 , 2026 | 09:58 AM

వ్యాలీ ఫీవర్ అనేది అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. కోక్సిడియోయిడ్స్ అనే ఫంగస్ కారణంగా ఇది వస్తుంది. ఈ ఫంగస్ నేలపై జీవిస్తుంది. నేలపై నుంచి గాల్లో కలిసినపుడు.. ముక్కు లేదా నోటి ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది.

అమెరికాలో విషాదం.. తెలుగు టెకీని బలి తీసుకున్న వ్యాలీ ఫీవర్..
Indian techie

న్యూయార్క్, మే 11: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ఓ తెలుగు టెకీ ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తెలుగు వ్యక్తి చిరంజీవి కొల్ల కాలిఫోర్నియాలో లీడ్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ఏప్రిల్ నెలలో అతడు సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యాడు. కొద్దిరోజులకే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. దీంతో కుటుంబసభ్యులు చిరంజీవిని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు వ్యాలీ ఫీవర్ సోకినట్లు గుర్తించారు.


ఆరోగ్యం బాగా దెబ్బ తినటంతో అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. అయినా లాభం లేకుండా పోయింది. 30 రోజుల పాటు వ్యాలీ ఫీవర్‌తో పోరాడిన చిరంజీవి ప్రాణాలు కోల్పోయాడు. చిరంజీవి బంధువు రామ కోటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘వ్యాలీ ఫీవర్ వస్తే గుర్తించటం చాలా కష్టం. ఆ ఫీవర్ కారణంగా చిరంజీవి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. నెల రోజుల పాటు అతడిని వెంటి లేటర్‌పై ఉంచారు. ఈ నెల రోజులు అతడి భార్య పావని పక్కనే ఉండి చూసుకుంది. వారి ఐదేళ్ల కుమారుడు విహాన్‌.. తండ్రి ఇంటికి ఎప్పుడు వస్తాడని అడుగుతుండేవాడు. పావని పిల్లాడికి తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించి చెప్పేది. డాక్టర్లు చిరంజీవికి అన్ని రకాల మందులు ఇచ్చారు. 30 రోజల పోరాటం తర్వాత అతడు మరణించాడు’ అని తెలిపాడు.


అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్

వ్యాలీ ఫీవర్ అనేది అరుదైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. కోక్సిడియోయిడ్స్ అనే ఫంగస్ కారణంగా ఇది వస్తుంది. ఈ ఫంగస్ నేలపై జీవిస్తుంది. నేలపై నుంచి గాల్లో కలిసినపుడు.. ముక్కు లేదా నోటి ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాలీ ఫీవర్ వస్తే ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. న్యుమోనియా లాంటి లక్షణాలు ఉంటాయి. అత్యంత అరుదుగా ఈ ఇన్‌ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దక్షిణ అమెరికా, మెక్సికోలలో ఈ ఇన్‌ఫెక్షన్ తరచుగా వస్తుంటుంది.


ఇవి కూడా చదవండి

కర్నూలులోనే స్పోర్ట్స్ హాస్టల్: మంత్రి టీజీ భరత్

విమానం చక్రాల్లో మంటలు.. ల్యాండింగ్ సమయంలో ఘటన.. వైరల్ వీడియో

Updated Date - May 11 , 2026 | 10:09 AM