కర్నూలులోనే స్పోర్ట్స్ హాస్టల్: మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - May 11 , 2026 | 09:39 AM
ఏపీలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలన్నారు.
కర్నూలు, మే 11: కర్నూలులో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ , ఎంపీ బస్తీపాటి నాగరాజు, శాప్ చైర్మన్ రవి నాయుడు సందర్శించారు. క్రీడల అభివృద్ధిపై మంత్రి చర్చించారు. సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న క్రీడాకారులను టీజీ భరత్ అభినందించారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలన్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు పదిరెట్లు ఎక్కువ ఉత్సాహంగా వర్క్ చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.
టీజీవీ గ్రూప్ నుంచి దశాబ్దాలుగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. స్పోర్ట్స్ హాస్టల్ కర్నూలులోనే ఉంటుందని... ఎక్కడికి తరలించడం లేదన్నారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పార్క్‌లను వ్యాయామం చేసేందుకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అల్మాస్‌పేట సర్కిల్ ఘటనపై అధికారులు సీరియస్..
Read Latest AP News And Telugu News