Share News

కడప అల్మాస్‌పేట సర్కిల్‌ ఘటనపై అధికారులు సీరియస్..

ABN , Publish Date - May 11 , 2026 | 08:53 AM

కడప నగరంలోని అల్మాస్‌పేట సర్కిల్ వద్ద ఘర్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సీరియస్ అయ్యారు. డ్రగ్స్, గంజాయి తీసుకుని ఆ మత్తులో ఈ ఘర్షణకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.

కడప అల్మాస్‌పేట సర్కిల్‌ ఘటనపై అధికారులు సీరియస్..
Almaspet Circle in Kadapa

కడప, మే11: కడప నగరంలోని అల్మాస్‌పేట సర్కిల్ వద్ద ఘర్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సీరియస్ అయ్యారు. డ్రగ్స్, గంజాయి తీసుకుని ఆ మత్తులో ఈ ఘర్షణకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ రాకేశ్ చంద్రను జిల్లా కలెక్టర్ శ్రీధర్ బాధ్యతల నుంచి తప్పించారు.


కడపలోని అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పు వివాదానికి దారితీసింది. అల్మాస్‌పేట సర్కిల్‌ను టిప్పుసుల్తాన్ సర్కిల్‌గా మార్చాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ సర్కిల్ పక్కనే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. మే 12వ తేదీ హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అందుకోసం ఈ సర్కిల్ వద్ద భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.


ఆ ఫ్లెక్సీ అల్మాస్‌పేటను హనుమాన్ సర్కిల్ అంటూ రాశారు. ఇది అసలు వివాదానికి కారణమైంది. శనివారం ఉదయం ఇరువర్గాలు.. పోటాపోటీగా ఆందోళనలు చేపట్టాయి. దాంతో ఆయా వర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు వర్గాల వారిని చెరదగొట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌ను బాధ్యతల నుంచి తప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు

మోదీ రాక.. మరిచిపోలేని జ్ఞాపకం: నారా భువనేశ్వరి

For More AP News And Telugu News

Updated Date - May 11 , 2026 | 09:44 AM