Share News

రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు

ABN , Publish Date - May 11 , 2026 | 07:56 AM

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. సింగపూర్ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు
Lokesh Nara

సింగపూర్, మే11: రాష్ట్రానికి మీరంతా బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సింగపూర్‌లోని తెలుగు ఎన్నారైలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ఆయన సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎయిర్ పోర్ట్‌లో లోకేశ్‌కు తెలుగు ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారితో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. మీరు పని చేస్తున్న సంస్థల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితోపాటు వస్తున్న పెట్టుబడుల కోసం మాట్లాడాల్సి ఉందన్నారు.


కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సంస్థలు తదితర అంశాలను మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఏపీలో ఏర్పాటు కావడంపై ఈ సందర్భంగా సింగపూర్‌లోని ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి లోకేశ్.. పలువురు పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ కంపెనీల సీఈఓలతో సమావేశం కానున్నారు.


ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సింగపూర్‌కు మంత్రి లోకేశ్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సింగపూర్ పర్యటన ముగించుకుని.. సోమవారం రాత్రికి ఆయన ఢిల్లీకి చేరుకుంటారని సమాచారం. మంగళవారం అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత్ బిశ్వకర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరుకానున్నారని తెలుస్తుంది.


మరోసారి అస్సాం సీఎంగా హిమంత్ బిశ్వకర్మ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి లోకేశ్‌ను హిమంత్ బిశ్వ కర్మ ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరై.. ఆ తర్వాత రాజధాని అమరావతికి మంత్రి లోకేశ్ చేరుకుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓబీసీ గణన చేసేదాకా పోరాటం ఆగదు

మోదీ రాక.. మరిచిపోలేని జ్ఞాపకం: నారా భువనేశ్వరి

For More AP News And Telugu News

Updated Date - May 11 , 2026 | 09:02 AM