Share News

30 ఏళ్ల నిరీక్షణ.. దంపతులను వరించిన రూ. 390 కోట్ల లాటరీ..

ABN , Publish Date - May 07 , 2026 | 12:10 PM

30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ దంపతులను భారీ అదృష్టం వరించింది. పది కాదు ఇరవై కాదు.. ఏకంగా 390 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

30 ఏళ్ల నిరీక్షణ.. దంపతులను వరించిన రూ. 390 కోట్ల లాటరీ..
US lottery winners

న్యూయార్క్, మే 7: 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ దంపతులను భారీ అదృష్టం వరించింది. పది కాదు ఇరవై కాదు.. ఏకంగా 390 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్‌కు చెందిన దంపతులు గత 30 ఏళ్లుగా లాటరీలు కొంటున్నారు. ఏనాటికైనా తమను అదృష్టం వరిస్తుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. వారి నమ్మకమే నిజమైంది. దంపతులు ఏప్రిల్ నెలలో మెస్క్వైట్‌లోని సెవెన్ ఎలెవెన్ స్టోర్ నుంచి క్విక్ పిక్ లాటరీ టికెట్ కొన్నారు.


ఆ టికెట్ వారి జీవితాన్ని మారుస్తుందని దంపతులు అస్సలు ఊహించలేదు. ఏప్రిల్ 20వ తేదీన తీసిన డ్రాలో వారు కొన్న టికెట్‌కు ప్రైజ్ మనీ వచ్చింది. ఏకంగా 41 మిలియన్ డాలర్స్ (ఇండియన్ కరెన్సీలో 390 కోట్ల రూపాయలు) వారి సొంతం అయ్యాయి. అయితే, పేర్లు బయటకు చెప్పడానికి ఆ దంపతులు ఇష్టపడలేదు. వారు లాటరీ అధికారులతో మాట్లాడుతూ..


‘మేము గత 30 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాం. ఏ రోజైనా అదృష్టం వరించకపోతుందా అన్న నమ్మకంతో ఉన్నాం. 30 ఏళ్ల తర్వాత అదృష్టం వరించింది’ అని అన్నారు. వచ్చిన డబ్బులలో కొంత కుటుంబసభ్యులకు పంచుతామని చెప్పారు. మరికొంత డబ్బుతో ప్రపంచ పర్యటన చేస్తామని అన్నారు.


ఇవి కూడా చదవండి

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి.. పంజాబ్ కింగ్స్‌పై ఇషాన్ కిషన్ సెటైర్..

Updated Date - May 07 , 2026 | 12:22 PM