4 డిగ్రీల వరకు పెరగనున్న ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:41 PM
తమిళనాడు, పుదుచ్చేరిలో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి.
చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరిలో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. 28 నుంచి 31వ తేది వరకు పశ్చిమ కనుమల కొండ ప్రాంతాల సరిహద్దు జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. మిగిలిన తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుంది.
అలాగే, గురు, శుక్రవారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశముంది. శనివారం నుంచి ఆదివారం వరకు పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. రాజధాని నగరం చెన్నై(Chennai)లో ఆకాశం కొంచెం మేఘావృతమై ఉంటూ, పగటి ఉష్ణోగ్రతలు 33-34 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24-25 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు, దర్శకుడు కన్నుమూత
ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Read Latest Telangana News and National News